టేకులపల్లి, జనవరి 06 : టేకులపల్లి మండలం లచ్య తండాకు చెందిన ఓ మహిళ నాటుసారా అమ్మకాలు జరుపుతున్నదన్న సమాచారం మేరకు కొత్తగూడెం ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం మంగళవారం రైడ్ చేసింది. ఈ సందర్భంగా జరిపిన సోదాల్లో 180 కేజీల బెల్లం, 50 కేజీల పటిక, 2 లీటర్ల నాటుసారా లభించింది. అలాగే 100 లీటర్ల పానకాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. సంబంధిత మహిళపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ఫోర్స్ ఎస్ఐ గౌతమ్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ సిబ్బంది హాబీబ్ పాషా, గురవయ్య, సుమంత్, రమేశ్, పార్థసారథి పాల్గొన్నారు.