Vaddepalli Srikrishna | హైదరాబాద్ : టాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ గీత రచయిత వడ్డేపల్లి శ్రీకృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వడ్డేపల్లి కృష్ణ కవి, సినీ గేయ రచయిత, లతితగీతాల రచయిత కూడా. ఆయన ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’ గీతంతో ఫేమస్‌గా మారారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ఓ నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన వడ్డెపల్లి కృష్ణ.. కష్టపడి ఉన్నతస్థాయికి ఎదిగారు. వడ్డెపల్లి కృష్ణ మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. సినీ గేయ రచయిత వడ్డెపల్లి కృష్ణ గారి మరణ వార్త ఎంతో బాధించింది. సిరిసిల్లలోని చేనేత కుటుంబంలో పుట్టిన ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు. రచయితగా, పరిశోధకుడిగా, దర్శకుడిగా పలు రంగాల్లో అద్భుతమైన ప్రతిభతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. సాహిత్య రంగంలో వడ్డెపల్లి కృష్ణ సేవలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కడం విశేషం. ఆయనతో ఎప్పుడు మాట్లాడినా సాహిత్యానికి మరింత సేవ చేయాలనే తపన కనిపించేది. లలిత గీతాల రచయితగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కష్టకాలంలో కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | ప్రజాకవి కాళోజీకి ఘన నివాళి.. ఎక్స్ అకౌంట్లో కేటీఆర్ పోస్ట్
Snake Catcher: నోట్లో నాగుపాముతో ఫోటోలకు ఫోజు.. ప్రాణాలు కోల్పోయిన స్నేక్‌క్యాచర్.. వీడియో
Harish Rao | 9 నెలల కాంగ్రెస్ పాలనలో మహిళలపై 1900 లైంగికదాడులు: హరీశ్ రావు