KTR : ఈ నెల 9న ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ‘కవిత్వం వ్రాసిన ప్రజాకవి, హక్కులడిగిన ప్రజల మనిషి, ఉద్యమం నడిపిన ప్రజావాది, తెలంగాణ జీవిత చలనశీలి కాళోజీ. పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజీ’ అని కేటీఆర్ స్మరించుకున్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో కాళోజీ జన్మించిన తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించుకున్నామని కేటీఆర్ గుర్తుచేశారు. వరంగల్లో నెలకొన్న రాష్ట్ర ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టుకున్నామని చెప్పారు. అదేవిధంగా హన్మకొండ పట్టణంలో కాళోజీ కళాక్షేత్రాన్ని అద్భుతంగా నిర్మించుకున్నామని తెలిపారు. ఈ నెల 9న ఆ మహానుభావుడి జయంతి సందర్బంగా ఘననివాళి అర్పిస్తున్నానని కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
కవిత్వం వ్రాసిన ప్రజాకవి,
హక్కులడిగిన ప్రజల మనిషి,
ఉద్యమం నడిపిన ప్రజావాది,
తెలంగాణ జీవిత చలనశీలి కాళోజిపుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి
KCR గారి ప్రభుత్వంలో ఆయన జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించుకున్నాం
వరంగల్ లో… pic.twitter.com/5gWcz9YO4q
— KTR (@KTRBRS) September 6, 2024