Sakshee Malikkh : హరియాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్ (Vinesh Phogat), బజరంగ్ పునియా (Bajrang Punia) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వీరిద్దరూ ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ కావడంతో వీరి చేరిక లాంఛనమేనని చెబుతున్నారు. అయితే ఓ రాజకీయ పార్టీలో చేరాలనే బజరంగ్, వినేష్ల నిర్ణయం వారి వ్యక్తిగతమని ప్రముఖ రెజ్లర్ సాక్షి మాలిక్ (Sakshee Malikkh) స్పష్టం చేశారు. మహిళా రెజ్లర్ల కోసం తాము చేపట్టిన పోరాటం తప్పుడు సంకేతాలను పంపరాదనేది తన అభిప్రాయమని ఆమె పేర్కొన్నారు.
తన వరకైతే తమ ఉద్యమం కొనసాగుతుందని ఆమె చెప్పుకొచ్చారు. తనకూ కొన్ని ఆఫర్లు వచ్చాయని, అయితే తాము ప్రారంభించిన ఉద్యమం ముగింపు వరకూ కొనసాగించాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. తమ పోరాటం నిజాయితీతో కూడినదని, ఇది కొనసాగుతుందని సాక్షి మాలిక్ తేల్చిచెప్పారు. కాగా, భారత స్టార్ రెజ్లర్లు (Wrestlers) వినేశ్ ఫోగట్ (Vinesh Phogat), బజరంగ్ పునియా (Bajrang Punia) కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరికీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రెజ్లర్లు హస్తం పార్టీలో చేరిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో వీరిద్దరూ కాంగ్రెస్‌లోకి చేరుతున్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది.ఇక ఈ నెల 4వ తేదీన బజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్ ఇద్దరూ రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని కలిసిన విషయం తెలిసిందే. ఈ భేటీకి సంబంధించిన ఫొటోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ‘వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ను కలిశారు’ అంటూ ట్వీట్ పెట్టింది.
Read More :