Deepthi Jeevanji | ప్రతిష్ఠాత్మక పారిస్ పారాలింపిక్స్‌లో భారత యువ అథ్లెట్ జివాంజీ దీప్తి (Deepthi Jeevanji) సత్తాచాటిన విషయం తెలిసిందే. మహిళల 400మీటర్ల టీ20 రేసులో కాంస్య పతకం గెలుచుకుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన రేసులో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ తెలంగాణ అమ్మాయి అరంగేట్రం పారాలింపిక్స్‌లో తొలి పతకాన్ని ముద్దాడి ఔరా అనిపించింది. తాజాగా దీప్తి స్వదేశానికి చేరుకుంది. ఇవాళ ఉదయం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. ఈ సందర్భంగా దీప్తికి ఘన స్వాగతం లభించింది. అధికారులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
#WATCH | Hyderabad, Telangana | 2024 Paris Paralympic Bronze medalist sprinter Deepthi Jeevanji received a warm welcome at Rajiv Gandhi International Airport on her return to the country, today
Deepthi Jeevanji won Bronze medal in the Women’s 400M T20 at the Paralympics 2024 pic.twitter.com/hqqtRBJ6Af
— ANI (@ANI) September 6, 2024
కాగా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన దీప్తి జివాంజీ పారాలింపిక్స్‌లో కంచు మోత మోగించింది. మహిళల 400 మీటర్ల పరుగు పందెం (టీ20)లో దీప్తి.. 55.82 సెకన్లలో పరుగును పూర్తిచేసి మూడో స్థానాన్ని దక్కించుకుని కాంస్యంతో సత్తా చాటింది. అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం నెగ్గిన ఉక్రెయిన్ అథ్లెట్ షులియర్ యులియ (55.16), రజతం గెలిచిన టర్కీ అమ్మాయి ఒండర్ ఐసెల్ (55.23)కు దీప్తి మధ్య తేడా మిల్లీ సెకన్లే.
సోమవారం జరిగిన హీట్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన దీప్తి.. తుది పోరులో తృటిలో బంగారు పతకాన్ని చేజార్చుకున్నా పోడియంపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది. రేసు మధ్య వరకూ రెండో స్థానంలో ఉన్న దీప్తి లక్ష్యానికి కొద్దిదూరంలో ఉండగా నెమ్మదించడాన్ని టర్కీ అమ్మాయి సద్వినియోగం చేసుకుంది.
Also Read..
Jr NTR | మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. తమ్ముడికి శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్
Underwear Gang | నాసిక్‌లో మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్చల్.. ఒకే రాత్రి ఆరు దుకాణాల్లో చోరీ
Jagadishreddy | తన ప్రాంత ప్రజల కోసం జిట్టా ఎంతో తపనపడ్డారు : జగదీష్ రెడ్డి