హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ కారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి(తన ప్రాంత ప్రజల కోసం ఎంతో తపనపడ్డారని మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadishreddy) అన్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి(Jitta Balakrishna Reddy) )మరణం పట్ల సంతాపం(Condoles) తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన అనేక పోరాటాల్లో కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు. బాలకృష్ణారెడ్డి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మరణం తీరని లోటన్నారు. వారికుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాగా, బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న జిట్టా బాలకృష్ణారెడ్డి.. గత కొంతకాలంగా సికింద్రాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు భువనగిరికి తరలించారు. సాయంత్రం 4 గంటలకు పట్టణ శివార్లలోని మగ్గంపల్లి రోడ్డులో ఉన్న తమ ఫామ్‌హౌస్‌లో అంతక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు.