Underwear Gang | మహారాష్ట్రలోని నాసిక్ (Nashik)లో చెడ్డీ గ్యాంగ్ (Underwear Gang) వరుసదాడులకు పాల్పడుతోంది. మలేగావ్ (Malegaon) ప్రాంతంలో మూడు రోజుల క్రితం ‘చెడ్డీ ముఠా’, ‘గౌన్ గ్యాంగ్’ వరుస చోరీలకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా అదే ప్రాంతంలో ‘చెడ్డీ-బనియన్’ గ్యాంగ్ (Chaddi Baniyan Gang) హల్చల్ చేసింది.
బుధవారం అర్ధరాత్రి సమయంలో పలు దుకాణాల్లో చోరీకి పాల్పడింది. ఎరువులు, హార్డ్వేర్, విద్యుత్ పంపులు విక్రయించే ఆరు దుకాణాల్లోకి చొరబడ్డ ఈ గ్యాంగ్.. రూ. లక్షల విలువైన వస్తువులను అపహరించుకుపోయింది. ఆయా షాపుల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో ఈ ముఠా దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
#महाराष्ट्र–#नासिक के मालेगांव में चड्डी बनियान गैंग का खौफ जारी है.. मनमाड चौफुली इलाकें में इस गिरोह ने 6 दुकानें तोड़ी और लाखों का माल लेकर फरार हो गए..#Maharashtra #Nashik #CCTV pic.twitter.com/k9Z0ORVONw
— Vinit Tyagi(Journalist) (@tyagivinit7) September 6, 2024
కాగా, మలేగావ్ (Malegaon) ప్రాంతంలో మూడు రోజుల క్రితం చెడ్డీ గ్యాంగ్ (Underwear Gang) హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి సమయంలో ఓ ఇంట్లోకి చొరబడ్డ ఈ గ్యాంగ్ 70 గ్రాముల విలువైన బంగారం (Gold), అరటిపళ్లను (Bananas) చోరీ చేసింది. అపహరణకు గురైన బంగారం విలువ రూ.5 లక్షలుగా ఉంటుందని అధికారుల అంచనా.
అంతకుముందు ‘గౌన్’ గ్యాంగ్ (gown gang) కూడా ఈ ప్రాంతంలో కలకలం సృష్టించింది. మహిళల వస్త్రాలను ధరించి నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని చోరీకి పాల్పడింది. పలు ఇళ్లను దోచుకుంది. అంతేకాకుండా ఓ ఆలయంలోని హుండీలోని సొమ్మును కూడా అపహరించుకెళ్లింది. ‘చెడ్డీ’, ‘గౌన్’ ముఠాల వరుస చోరీలతో మలేగావ్ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Also Read..
Killer wolfs | బహరాయిచ్ ప్రజలను బెంబేలెత్తిస్తున్న తోడేళ్లు.. మరో చిన్నారిపై దాడి
Covid Scam: కోవిడ్ వేళ అక్రమాలు.. కర్నాటకలో వెయ్యి కోట్లు లూటీ