Killer wolfs | బహరాయిచ్ ప్రజలను బెంబేలెత్తిస్తున్న తోడేళ్లు.. మరో చిన్నారిపై దాడి
Killer wolfs | ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్ (Bahraich) జిల్లాలో ప్రజలకు తోడేళ్లు (Killer wolfs) కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా మరో పిల్లాడిపై తోడేలు దాడి (wolf attack) చేసింది.
Killer wolfs | ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్ (Bahraich) జిల్లాలో ప్రజలకు తోడేళ్లు (Killer wolfs) కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మానవ రక్తం రుచి మరిగి ప్రాణాంతకంగా మారిన ఆరు తోడేళ్లు గ్రామాల్లోకి చొరబడి ప్రజలపై దాడి చేస్తున్నాయి. వీటి దాడుల్లో ఇప్పటికే పది మందిదాకా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన యూపీ సర్కార్ ఆపరేషన్ భేడియా చేపట్టింది. అయినప్పటికీ వాటి బెడత తప్పడం లేదు. తాజాగా మరో పిల్లాడిపై తోడేలు దాడి (wolf attack) చేసింది.
కొత్వాలి ప్రాంతంలో గురువారం రాత్రి సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న 10 ఏళ్ల బాలుడి (10 year old boy)పై తోడేలు దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారి ముఖంపై గాయాలయ్యాయి. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చిన్నారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సుమారు 50 రోజుల నుంచి బహరాయిచ్ సహా మరికొన్ని జిల్లాలో తోడేళ్లు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ తోడేళ్ల దాడిలో ఇప్పటి వరకూ 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో తొమ్మిది మంది చిన్నారులే ఉండటం కలచి వేస్తోంది. వీటి దాడిలో సుమారు 35 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన యూపీ సర్కార్ ఆపరేషన్ భేడియా చేపట్టింది. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి ఇప్పటివరకూ నాలుగు తోడేళ్లను పట్టుకుంది. మిగతా రెండింటిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
తోడేళ్లను పట్టుకోవడానికి అటవీ శాఖాధికారులు చిన్న పిల్లల మూత్రంతో తడిసిన రంగు రంగుల టెడ్డీ బేర్లను అవి విశ్రాంతి తీసుకునే నదీ పరీవాహక ప్రాంతాల్లో పెడుతున్నారు. తోడేళ్లు రాత్రి వేళ జనంపై దాడి చేసి, ఉదయానికల్లా తిరిగి తమ విశ్రాంతి ప్రదేశాలకు వెళ్లిపోతున్నాయని డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ చెప్పారు. ప్రస్తుతం ఈ కిల్లర్ తోడేళ్లను పట్టుకోవడం అధికారులకు సవాల్‌గా మారుతోంది.
దీంతో పరిస్థితి తీవ్రత దృష్ట్యా అటవీ శాఖ అధికారులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తోడేళ్లను పట్టుకోవడం సాధ్యం కాని తరుణంలో అవి కనిపిస్తే కాల్చివేయాలని ఆదేశించారు (shoot at sight order). అయితే, అది చివరి అవకాశంగా మాత్రమే పరిగణించాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు తోడేళ్లను కాల్చేందుకు తొమ్మిది మంది షూటర్ల బృందం బహరాయిచ్ అడవుల్లో మోహరించింది.
Also Read..
Jitta Balakrishna Reddy | బీఆర్ఎస్ లీడర్.. తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత
ED Raids | మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ఇంటిపై ఈడీ దాడులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

