Gudlavalleru Engineering College | గుడ్లవల్లేరు కాలేజీ హాస్టల్లో హిడెన్ కెమెరాలు లేవు.. కీలక వివరాలు వెల్లడించిన ఐజీ
Gudlavalleru Engineering College | కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో హిడెన్ కెమెరాల విషయంపై ఐజీ అశోక్‌కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. పోలీసుల దర్యాప్తులో ఎటువంటి రహస్య కెమెరాలను గుర్తించలేదని ఆయన తెలిపారు. విద్యార్థినులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు
Gudlavalleru Engineering College | కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో హిడెన్ కెమెరాల విషయంపై ఐజీ అశోక్‌కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. పోలీసుల దర్యాప్తులో ఎటువంటి రహస్య కెమెరాలను గుర్తించలేదని ఆయన తెలిపారు. విద్యార్థినులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కేసు విచారణకు సంబంధించిన వివరాలను ఎస్పీ గంగాధర్‌తో కలిసి ఆయన గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు.
ప్రత్యేక మహిళా బృందంతో కలిసి హాస్టల్ గదుల్లో తనిఖీ చేశామని.. ఎక్కడా కెమెరాలు కనిపించలేదని ఐజీ అశోక్‌కుమార్ వెల్లడించారు. 35 మంది విద్యార్థినులు, వార్డెన్లు, సిబ్బందినీ విచారించగా.. కెమెరాలు కానీ, వీడియోలు కానీ ప్రత్యక్షంగా చూసినట్లు ఏ ఒక్కరూ చెప్పలేదని స్పష్టం చేశారు. హిడెన్ కెమెరాలు, వీడియోల అంశం ఎవరో చెబితేనే తమకు తెలిసిందని విచారణలో విద్యార్థులు చెప్పారని అన్నారు. సీఎం చంద్రబాబు చొరవతో ఢిల్లీకి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ), పుణెకు చెందిన సీ డాక్ టెక్ నిపుణుల సాయంతో విద్యార్థుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు ఇతర గ్యాడ్జెట్లనూ తనిఖీ చేశామని చెప్పారు.
వారం రోజలు పాటు సాగిన దర్యాప్తులో హిడెన్ కెమెరాల ఏర్పాటు, వీడియోల షేరింగ్ జరగలేదని నిర్ధారించామని ఐజీ అశోక్‌కుమార్ తెలిపారు. ఒకవేళ ఎవరైనా సాక్ష్యాలతో ముందుకొస్తే దర్యాప్తు కొనసాగిస్తామని పేర్కొన్నారు. గుడ్లవల్లేరు కాలేజీ వ్యవహారంపై సోషల్‌మీడియాలో జరిగిన దుష్ప్రచారంపై కూడా విచారణ జరుపుతున్నామని చెప్పారు. వచ్చిన వివరాల ఆధారంగా వాటిపైనా చర్యలు చేపడతామని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

