అమరావతి : వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కె రోజా(RK Roja) కీలక వ్యాఖ్యలు చేశారు. గత 5 రోజులుగా విజయవాడ (Vijayawada) లో జరుగుతున్న విపత్తుపై తొలిసారిగా ఎక్స్ వేదిక ద్వారా స్పందించారు. మాజీ సీఎం జగన్ (YS Jagan) చేపట్టిన కార్యక్రమాలే విజయవాడ వాసులను గట్టెక్కిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
వైసీపీ హయాంలో తీసుకొచ్చిన రేషన్ వాహనాలు(Ration Vehicles) , సచివాలయ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థ, రిటైనింగ్ వాల్(Retining wall) కట్టించారని తెలిపారు. నాటి ప్రభుత్వం కొనుగోలు చేసిన 108, 104వాహనాలు, సచివాలయ ఉద్యోగుల నియామకం, క్లీన్ ఆంధ్రా వాహనాలు, వైఎస్సార్ హెల్త్ సెంట్రర్లు బాధితులకు ఎంతగానో అండగా నిలుస్తున్నాయని వెల్లడించారు.
వరద సహాయక చర్యల్లో చంద్రబాబు ప్రభుత్వం చేస్తోందేమీ లేదని ఆరోపించారు. బుడమేరు గండ్లు పడి దాదాపు విజయవాడ పట్టణంలోని 32 కాలనీలు నీట మునిగాయి. సుమారు లక్ష మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వర్షాలు, వరద వల్ల సుమారు 32 మంది ప్రాణాలు కోల్పోయ్యారు. పశు, పక్ష్యాదులు నష్టపోయాయి.