ఒక సినిమాకు చాలా మంది టెక్నీషియన్లు భారీగానే పారితోషికం తీసుకుంటారనే విషయం తెలిసిందే. అలాంటి జాబితాలోనే ఉంటాడు టాలీవుడ్ (Tollywood) లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ (Thaman). ప్రతీ సినిమాకు థమన్ కోట్లలోనే ఛార్జ్ చేస్తాడనే ప్రచారం ఎప్పటినుంచో ఉన్నదే. ఇండస్ట్రీ సర్కిల్ టాక్ ప్రకారం థమన్ చిన్న సినిమాల నుంచి పవన్ కల్యాణ్, మహేశ్ బాబు సినిమాల వరకు ఏదైనా సరే 2.5 కోట్ల నుంచి 3.5 కోట్ల వరకు వసూలు చేస్తున్నాడట.
చాలా సినిమాల్లో థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (background score) ప్రధాన హైలెట్‌గా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అల వైకుంఠపురంలో, వకీల్‌సాబ్, క్రాక్ సినిమాలు థమన్ బీజీఎం లేకుండా ఊహించలేమంటే అతిశయోక్తి కాదు. అధికంగా ఛార్జీలు తీసుకోవడంపై థమన్ స్పందిస్తూ…నా మ్యూజిక్ ప్రభావం ఎలా ఉంటుందో..నాకు డబ్బు ఎంత స్థాయిలో ఇవ్వాలో నిర్మాతలకు తెలుసు. నా మ్యూజిక్ వర్కవుట్ కాకపోతే భారీగా చెల్లించేందుకు నిర్మాతలేమి ఫూల్స్ కాదు. డిమాండ్‌కు తగ్గట్టుగా సరిపోయేంత డబ్బును ఆశిస్తాను.
ముఖ్యమైన విషయమేంటంటే థమన్ తీసుకునే రెమ్యునరేషన్ కేవలం అతనొక్కడికే కాదు. తన పారితోషికంలో సుమారు 50 శాతాన్ని తన సౌండ్ ఇంజినీర్లు, పాపులర్ మిక్స్ ఇంజినీర్ షాదాబ్ రయీన్, పాపులర్ సింగర్స్, ప్రొఫెషనల్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ తోపాటు చాలా మందికి చెల్లిస్తాడు థమన్.
ఇది కూడా చూడండి
Mahesh Babu black Royal look | న్యూ స్టైలిష్ లుక్‌లో మహేశ్‌బాబు..ఫొటోషూట్ అదిరింది
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Shahid Kapoor About Jersey | బిచ్చగాడిలా తిరుగుతూ అందరినీ అడిగా: షాహిద్‌కపూర్