టాలీవుడ్ (Tollywood)లో రాబోతున్న ఎక్జయిటింగ్ ప్రాజెక్టుల్లో ఒకటి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తున్న అఖండ. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూఏ సర్టిఫికెట్ పొందింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా గురించి థమన్ (Thaman)ట్విటర్ ద్వారా అప్ డేట్ ఇచ్చాడు.
ప్రస్తుతం డాల్బీఅట్మాస్ మిక్సింగ్ వర్క్ (బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే శబ్దాన్ని నియంత్రించడం) చేస్తున్నారు. స్టూడియోలో డైరెక్టర్ బోయపాటితో దిగిన ఫొటోను థమన్ షేర్ చేశాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్లో థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా రేంజ్‌ను అమాంతం పెంచేసింది. థమన్ నుంచి ఔట్ అండ్ ఔట్ మ్యూజికల్ ట్రీట్ కోసం వెయిట్ చేస్తున్నారు సినీ జనాలు. అఖండ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్ విలన్ గా నటిస్తుండగా..జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Blockbuster combo @MusicThaman & #BoyapatiSrinu completed the final mix of #Akhanda 🥁🔥#AkhandaTrailerRoar
— BA Raju's Team (@baraju_SuperHit) November 22, 2021
🔗 https://t.co/2jRvp8yKIp
Roaring on Big Screens from 02/12/2021 💥 ✅#NandamuriBalakrishna @ItsMePragya #MiryalaRavinderReddy @dwarakacreation @LahariMusic pic.twitter.com/0pwwDqp7lr
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సింహా, లెజెండ్ సినిమాల తర్వాత బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Akhanda Musical Roar | అఖండ ‘గర్జన’ కేక..టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో
TJ Gnanavel Apology | క్షమాపణలు చెప్పిన జైభీమ్ డైరెక్టర్..!
Karthikeya Lohita marriage | గ్రాండ్‌గా హీరో కార్తికేయ వివాహం..పెళ్లి వేడుక వీడియో
Pooja Hegde Beach video | సాగరతీరాన బికినీలో పూజా హెగ్డే అందాల విందు..వీడియో వైరల్