దేశంలో కరోనా రెండో దశ మొదలైంది..మొదటి దశ కంటే దారుణంగా ఇది వ్యాపిస్తుంది. అప్పట్లో రోజుకు 90 వేల కేసులు వస్తేనే అమ్మో అనుకున్నారు. కానీ ఇప్పుడు లక్ష 30 వేలు దాటిపోయింది. అందుకే ప్రభుత్వాలు మళ్లీ కంగారు పడుతున్నాయి. ఇంత దారుణంగా పెరుగుతున్న కేసుల మధ్య సినిమాలు విడుదల చేయడం అంటే.. ఒక రకంగా ఆత్మహత్య చేసుకోవడమే. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ మొదలైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ క్షణమైనా ఈ నిర్ణయం అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.
ఎందుకంటే మన దగ్గర కూడా కేసులు దాదాపు 2,500 వరకు వస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే అది మరింత పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలో సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలకు ససేమిరా ఇష్టం లేదు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 16న రావాల్సిన లవ్ స్టోరీ సినిమా వాయిదా పడింది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమాను శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నాడు. ప్రమోషన్స్ కూడా మొదలైన తర్వాత ఈ సినిమాను వాయిదా వేశారు. ఇది కేవలం విస్తరిస్తున్న వైరస్ కారణంగానే వాయిదా వేస్తున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు.
దానికి తోడు పుష్ప, ఆచార్య లాంటి సినిమాలు కూడా వాయిదా పడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీటిని ఏకంగా ఆరు నెలలకు పైగా వాయిదా వేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పుడు విడుదల చేస్తే ఈ సినిమాలను రెండు మూడు వారాల్లోనే కచ్చితంగా ఓటీటీలో విడుదల చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఇష్టం లేని నిర్మాతలు తమ సినిమాలను మరికొంతకాలం వాయిదా వేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య అందరూ ఒకేసారి విడుదల తేదీలు అనౌన్స్ చేశారు.
ఇప్పుడు ఒక్కొక్కరుగా తమ సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు. ఏప్రిల్ 2న రావాల్సిన సీటీమార్ రాలేదు. ఇప్పుడు లవ్ స్టోరీ రావడం లేదు. ఇంకా ఎన్ని సినిమాలు ఈ బాటలో ఉన్నాయో తెలియదు. ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాకు వచ్చే కలెక్షన్లు చూసిన తర్వాత మరికొందరు నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఏదేమైనా కరోనా వైరస్ మళ్లీ కంగారు పెట్టడం మొదలైంది.
ఇవి కూడా చదవండి
ఇండియాలో బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే..?
చైతూ-సాయిపల్లవి ‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
కీలక స్థానానికి చిరంజీవి రాజీనామా..?
యూత్‌ఫుల్‌గా ‘రౌడీ బాయ్స్’ మోషన్ పోస్టర్
ముంబైలో ఖరీదైన ఇంటిని కొన్న సన్నీలియోన్
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో