శనివారం 05 డిసెంబర్ 2020
Cinema - Oct 24, 2020 , 12:40:03

మెహందీ వేడుక ఫోటోలు షేర్ చేసిన నేహా క‌క్క‌ర్

మెహందీ వేడుక ఫోటోలు షేర్ చేసిన నేహా క‌క్క‌ర్

ప్ర‌ముఖ గాయ‌నీ,గాయ‌కుడు నేహా క‌క్క‌ర్-రోహ‌న్ ప్రీత్ సింగ్‌లు అక్టోబ‌ర్ 26న ఢిల్లీలో వివాహం చేసుకోనున్న సంగ‌తి తెలిసిందే. వీరి వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, కొద్ది రోజులుగా మెహందీ, హ‌ల్దీ వంటి వేడుకలుకుటుంబ స‌భ్యుల మ‌ధ్య జ‌రుగుతున్నాయి. 

శుక్ర‌వారం జ‌రిగిన హ‌ల్దీ ఫంక్ష‌న్ ఫోటోల‌ను నేహా క‌క్క‌ర్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, ఇవి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. పసుపు రంగు దుస్తుల్లో, సంప్రదాయ వస్త్రధారణతో ఇద్ద‌రు చాలా అందంగా క‌నిపిస్తున్నారు. ఇక తాజాగా మెహందీ వేడుక‌కి సంబంధించిన ఫోటోలు షేర్ చేయ‌గా ఇందులో ఇద్ద‌రు గ్రీన్ రంగు దుస్తుల‌లో క‌నిపిస్తున్నారు. చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్న ఈ జంట‌కు నెటిజ‌న్స్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.  కాగా, నేహా క‌క్క‌ర్-రోహాన్‌ల రిసెప్షన్ పంజాబ్‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.