Mohan Babu | మంచు మోహన్ బాబు మంగళవారం రాత్రి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో (Continental hospital) చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు ఇవాళ హెల్త్ బులెటిన్ (health bulletin) విడుదల చేశారు. మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా లేదని తెలిపారు.
‘మోహన్ బాబు స్థిమితంగా (not stable) లేరు. మానసికంగా బాధపడుతున్నారు. ఏం జరుగుతోందో అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. ఆయన ఎడమ కంటి కింద కమిలినట్టు గాయమైంది. కుడివైపు కంటి కింద వాపు గుర్తించాం. ఇవాళ సిటిస్కాన్ చేయబోతున్నాం. ఆయన హైబీపీతో బాధపడుతున్నారు. హార్ట్ రేట్ కూడా ఎక్కువగా ఉంది. మరో రెండు రోజులు ఆయనకు ఆసుపత్రిలో చికిత్స చేయాల్సిన అవసరం ఉంది’ అని కాంటినెంటల్ వైద్యులు వెల్లడించారు.
Also Read..
Mohan Babu | పోలీసులను సవాల్ చేస్తూ.. హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్
Manchu Manoj | మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నా : మంచు మనోజ్
Manchu Mohan Babu | మీడియా ప్రతినిధులపై దాడి.. మోహన్‌బాబుపై కేసు నమోదు..