Manchu Mohan Babu | టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనకి పోలీసులు జారీ చేసిన నోటీసులని సవాలు చేస్తూ.. హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తన ఇంటివద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని.. తాను సెక్యూరిటీ కోరినా భద్రత కల్పించలేదని, వెంటనే తనకు భద్రత కల్పించాలని పిటిషన్లో కోరారు మోహన్ బాబు. ఈ పిటిషన్ను మోహన్ బాబు తరఫున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్ను హైకోర్ట్ మధ్యాహ్నం 2.30కి విచారించనుంది.
ఇదిలావుంటే జల్పల్లిలో మోహన్ బాబు ఇంటివద్ద మీడియాపై జరిగిన దాడి ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయినట్లు సమాచారం. మోహన్ బాబు చూట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని.. అలాగే మోహన్ బాబు విష్ణు దగ్గర ఉన్న గన్లను కూడా డిపాజిట్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.