Manchu Manoj | టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు మీడియాపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో జర్నలిస్ట్‌లు సంఘాలు అన్ని మోహన్ బాబుపై మండిపడుతుండగా.. తాజాగా ఈ విషయంలో క్షమాపణలు చెప్పాడు మంచు మనోజ్.
ఈ సందర్భంగా మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. నాన్న మీడియాపై దాడి చేయడం బాధ కలిగించింది. ఈ విషయంలో మీడియా మిత్రులందరికీ క్షమాపణలు చెబుతున్నా. నాన్న అంటే నాకు ప్రాణం. మా నాన్న నాకు ఎప్పటికి దేవుడే. అయితే మా నాన్నను అన్న విష్ణు.. వినయ్ అనే వ్యక్తి కలిసి ట్రాప్ చేశారు. అతడి దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారు. నేను నా భర్య మౌనిక కలిసి ఒక టాయ్స్ కంపెనీ పెట్టాము. దీనికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. నాపై దాడులు చేశారు. మా నాన్న ముందే నన్ను కొట్టారు. నాకు సపోర్ట్‌గా నిలిచిన మా అమ్మాను నా దగ్గరికి రాకుండా దూరంగా ఉంచుతున్నారు. ఈ గొడవ జరిగే సమయంలో నాకు తెలికుండా మా అమ్మని బయటకు పంపిచేశారు. ఆమెకి మనోజ్‌తో మేము మాట్లాడుతాం సర్ధిచెప్తాం అని మా అమ్మను నమ్మించారు అంటూ మనోజ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఈ వివాదంలో నా భార్యతో పాటు నా ఏడు నెలల కూతురిని లాగుతున్నారు. ఇలాంటి వాళ్లని ఏం అనాలి. నేను నా సొంత కాళ్ల మీద నిలబడుతున్నాను. ఎవరిని ఒక్క రూపాయి కూడా అడుగలేదు. ఈ గొడవకు సంబంధించి అన్ని వివరాలను నేడు సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టి వెల్లడిస్తాను అంటూ మంచు మనోజ్ చెప్పుకొచ్చాడు.
మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నా
మీడియాపై దాడి చేయడం బాధ కలిగించింది
నాన్న అంటే నాకు ప్రాణం.. మా నాన్న దేవుడు
మా నాన్న ను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారు
మా నాన్న దృష్టిలో నన్ను శత్రువు గా చిత్రీకరించారు
నేను నా భార్య కలిసి ఒక టాయ్స్ కంపెనీ పెట్టాము
వాటికి కూడా… pic.twitter.com/ICt9l9r29q
— Telugu Scribe (@TeluguScribe) December 11, 2024