Mimi Chakraborty | బెట్టింగ్ యాప్స్ (betting app case) వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కారణంగా ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో బెంగాల్ నటి, టీఎంసీ మాజీ ఎంపీ మిమి చక్రవర్తి (Mimi Chakraborty) ఈడీ (Enforcement Directorate) ఎదుట విచారణకు హాజరయ్యారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి (ED office) వెళ్లిన మిమి చక్రవర్తి.. అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.
#WATCH | Actress and former TMC MP Mimi Chakraborty arrives at ED headquarters in Delhi, as she joins the Enforcement Directorate (ED) investigation in illegal betting app 1xBet case, which is under scrutiny for suspected money laundering. pic.twitter.com/SRzZvOfyjx
— ANI (@ANI) September 15, 2025
మిమి చక్రవర్తితో పాటూ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాకు ఈడీ నోటీసులు జారీ చేసింది. మిమి చక్రవర్తిని ఈ నెల 15న, ఊర్వశిని ఈ నెల 16న ఢిల్లీలోని కార్యాలయంలో విచారణకు హాజరుకావలని ఆదేశించింది. వీరిద్దరూ ప్రముఖ బెట్టింగ్ యాప్ 1xBetకు ప్రచారం చేసినట్టు భావిస్తున్నారు. ఈడీ నోటీసుల మేరకు మిమి చక్రవర్తి ఇవాళ విచారణకు హాజరయ్యారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేంద్ర దర్యాప్తు సంస్థ నటి వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నది.
అక్రమ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసులను ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ చాలా మంది వ్యక్తులతో పాటు పెట్టుబడిదారులను రూ.కోట్లల్లో మోసం చేయడంతో పాటు భారీ మొత్తంలో పన్ను ఎగవేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక నిషేధిక బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కారణంగా ఇప్పటికే పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సెబ్రిటీలు కూడా విచారణకు హాజరైన విషయం తెలిసిందే. టాలీవుడ్ సినీ ప్రముఖుల పేర్లు వినిపించాయి. విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి సైతం విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, హర్భజన్‌సింగ్, యువరాజ్‌సింగ్, సురేశ్ రైనాలను సైతం ఈడీ విచారించింది. శిఖర్ను ఈ నెల 4న ఈడీ ఎనిమిది గంటల పాటు విచారించింది.
Also Read..
Suman | పవన్ కళ్యాణ్ ఈ పని చేస్తే బాగుంటుంది.. ఏమి ఆశించకుండా సపోర్ట్ ఇస్తానన్న సుమన్
Ileana | రెండో బిడ్డకి జన్మనిచ్చాక మానసికంగా అనేక సవాళ్లు ఎదుర్కొన్నాను: ఇలియానా
Teja Sajja | తేజ సజ్జా లైనప్ మాములుగా లేదుగా.. మిరాయ్ సక్సెస్ తర్వాత మరింత దూకుడు పెంచాడుగా..!