Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక వరుస సినిమాలు ఒప్పుకుంటున్నాడు. సీనియర్ దర్శకులు, కుర్రాళ్లు అనే తేడా లేకుండా కథ నచ్చితే అందరికీ కమిట్మెంట్ ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరో ఇద్దరు దర్శకులు చిరంజీవికి కథ చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య చివరి దశలో ఉంది. అక్టోబర్ 1న ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత లూసిఫర్ రీమేక్ మొదలు కానుంది. మోహన్ రాజా ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసి చిరంజీవి కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ కూడా విడుదల చేసి.. సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు గాడ్ ఫాదర్ టైటిల్ ఖరారు అయ్యేలా కనిపిస్తోంది.
మరోవైపు ఈ సినిమా తర్వాత బాబీ సిద్ధంగా ఉన్నాడు. ఒక స్టార్ హీరో, అభిమాని మధ్య జరిగే ఎమోషనల్ కథతో తెరకెక్కి మలయాళంలో సూపర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాకు ఇది రీమేక్ అని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. బాబీ తర్వాత వేదాళం రీమేక్ రెడీగా ఉంది. ఈ సినిమాను సెట్స్‌పైకి తెచ్చేందుకు మెహర్ రమేశ్ ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నాడు. ఇవన్నీ లైన్లో ఉండగానే మరో దర్శకుడు కూడా చిరంజీవికి కథ చెప్పి ఒప్పించాడని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు మారుతి.
మెగా కుటుంబంతో మారుతికి దాదాపు 20 ఏండ్ల అనుబంధం ఉంది. గతంలో చిరంజీవి సినిమాల పోస్టర్ డిజైన్లతో పాటు ప్రజారాజ్యం పార్టీకి కూడా మారుతి పనిచేశాడు. ఈ పరిచయంతోనే చిరంజీవికి మారుతి కథ చెప్పి ఒప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పక్కా కమర్షియల్, మంచి రోజులొచ్చాయి సినిమాలు చేస్తున్న మారుతి.. ఆ తర్వాత చిరు సినిమాపై దృష్టి పెడతాడని తెలుస్తోంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే కేవలం రెండేళ్ల సమయంలోనే చిరంజీవి ఈ ఐదు సినిమాలు పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆచార్య 2021లోనే విడుదల కానుంది. లూసిఫర్ రీమేక్‌ను 2022లో విడుదల చేయాలని, బాబీ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక వేదాళం రీమేక్‌ను 2023 సమ్మర్ కోసం సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ మారుతి సినిమా ఓకే అయితే 2023 చివర్లో లేదా తరువాత ఏడాది విడుదల చేసే అవకాశం ఉంది. అంటే రెండు మూడేళ్లలో ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ బిజీ అయిపోతాడు అన్నమాట. ఈ ప్లాన్ వినడానికి బాగానే ఉంది కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
తన భర్త 8 సార్లు కాళ్లు పట్టుకున్నాడని చెప్పిన జెనీలియా
కారు ప్రమాదం.. నడవలేని పరిస్థితిలో బిగ్ బాస్ బ్యూటీ
దోస్తి సాంగ్‌లో ఆ సీన్ హాలీవుడ్ సినిమాకు కాపీనా?
Priyanka chopra | పదో తరగతిలోనే ఫస్ట్ లవ్.. ఆ టైంలో నా బాయ్‌ఫ్రెండ్‌ను బీరువాలో దాచిపెట్టా.