దోస్తి సాంగ్‌లో ఆ సీన్ హాలీవుడ్ సినిమాకు కాపీనా?

రాజమౌళి సినిమాలకు ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రేజ్ ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. ఎన్టీఆర్,రామ్ చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు ఈ సినిమాలో నటిస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగాయి. అక్టోబర్ 13న చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్న జక్కన్న ప్రమోషన్ స్పీడ్ పెంచారు.
తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా నుండి దోస్తీ పాట విడుదల చేయగా, ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటని తెలుగులో హేమచంద్ర, తమిళ్ లో అనిరుధ్ రవిచందర్, కన్నడలో యాజిన్ నిజార్, మలయాళంలో విజయ్ ఏసుదాస్, హిందీలో అమిత్ త్రివేది పాడారు. ఈ పాట చివరిలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.
దోస్తీ పాట సోషల్ మీడియాని షేక్ చేస్తుండగా, దీనిపై పలువురు పెదవి విరుస్తున్నారు. పాట చివరిలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ చేతులు పట్టుకుంటూ కనిపించగా, ఇదే మనకు సినిమా పోస్టర్ లో కూడా చూపిస్తారు. అయితే స్టార్ వార్స్ సినిమాలో కూడా ఇదే విధంగా చేతులు పట్టుకునే సీన్ ఉంటుంది. ఆ సినిమా నుండే రాజమౌళి దీనిని తీసుకున్నారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్‌తో పాటు ఎన్టీఆర్,రామ్ చరణ్ ప్రోమోలపై కూడా ఇలాంటి కాపీ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Jr NTR
- Rajamouli
- ram charan
- RRR
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

