కారు ప్రమాదం.. నడవలేని పరిస్థితిలో బిగ్ బాస్ బ్యూటీ

తమిళ నటి,బిగ్ బాస్ ఫేం యషికా ఆనంద్ ..తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలోఆమె స్నేహితురాలు కన్నుమూసింది. వీకెండ్ సందర్భంగా తన ముగ్గురు స్నేహితులతో కలిసి యాషిక మహాబలిపురం లాంగ్‌డ్రైవ్‌కి వెళ్లగా, ఈ ప్రమాదం జరిగింది.
కారుని యషికానే డ్రైవ్ చేస్తుండగా, కారు అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఆమె స్నేహితురాలు భవానీ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన యాషిక, ఆమె మరో ఇద్దరు స్నేహితులను స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యషికా తాజాగా తన సోషల్ మీడియా ద్వారా స్పందించింది.
ప్రస్తుతం నా పరిస్థితి దారుణంగా ఉంది. రాబోయే 5 నెలలు నేను బెడ్‌పైనే ఉండాల్సి వస్తుంది. ఒకేలా పడుకోవల్సి ఉందని, పక్కకు కూడా జరగలేని పరిస్థితి. మోషన్ కోసం పక్కకు జరగలేను. తన బ్యాక్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిందని.. అదృష్టవశాత్తు మొహానికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపింది యషికా. ఇది నాకు మరో జన్మ అని చెప్పిన యషికా తన ఫ్రెండ్ మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నన్ను క్షమించు భవాని. జీవితంలో క్షమించరాని తప్పు చేశారు.కాని ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అంటూ ఎమోషనల్ అయింది యషికా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bigg boss
- Yashika Anand
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

