Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
Gopi Chand | టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ వరుస పరాజయాల నుంచి బయటపడి సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు. గతంలో తనకు విజయాలు అందించిన తరహా కథలకే పరిమితం కాకుండా, కొత్త కథలు, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
Gopi Chand | టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ వరుస పరాజయాల నుంచి బయటపడి సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు. గతంలో తనకు విజయాలు అందించిన తరహా కథలకే పరిమితం కాకుండా, కొత్త కథలు, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సినిమాలతోనైనా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని గోపీచంద్ ప్రయత్నిస్తున్నారు. గోపీచంద్ నటిస్తున్న చిత్రాల్లో ‘భరతవర్ష’ ఒకటి. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించింది. ఇటీవల విడుదల చేసిన ‘అమ్మ కదిలి వచ్చే’ పాటతో సినిమా సంగీత ప్రచారాన్ని కూడా ప్రారంభించారు.
విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై గోపీచంద్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఆయన కెరీర్‌కు ఎలాంటి మలుపు తీసుకొస్తుందోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు గోపీచంద్ ‘సింగా’ అనే పాన్ ఇండియా చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ సినిమాతో స్టంట్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తయినట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ గోపీచంద్ పాత్రపై ఆసక్తిని పెంచింది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఆయన కెరీర్లో మరో కీలక ప్రాజెక్టుగా నిలవనుంది.
ప్రస్తుతం ‘భరతవర్ష’, ‘సింగా’ చిత్రాలతో బిజీగా ఉన్న గోపీచంద్.. విడుదల తేదీల విషయంలో మాత్రం తొందరపడటం లేదని తెలుస్తోంది. ఒక సినిమా షూటింగ్ పూర్తవగా, మరో సినిమా సగానికిపైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయినప్పటికీ ఇప్పటివరకు ఈ రెండు సినిమాల విడుదల తేదీలను ప్రకటించలేదు. చిత్రీకరణ, నిర్మాణానంతర పనులు, ఇతర ఏర్పాట్లు పూర్తిగా సిద్ధమైన తర్వాతే విడుదల తేదీని ప్రకటించాలని చిత్ర బృందాలు భావిస్తున్నట్లు సమాచారం. ముందుగానే తేదీ ప్రకటించి, చివరి నిమిషంలో వాయిదా వేయాల్సిన పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ గత కొంతకాలంగా ఆశించిన విజయాలను అందుకోలేకపోతున్నారు. దీంతో ఈసారి కథల ఎంపికలో కొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ‘భరతవర్ష’, ‘సింగా’ చిత్రాలు రెండూ విభిన్నమైన నేపథ్యాలతో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఆయన అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
Burns crop | నీళ్లు లేక కరెంట్ రాక.. సూర్యాపేట జిల్లాలో పంటను కాలబెట్టిన కౌలు రైతు
AP News | తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం.. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు..!
Ishan Kishan | ఇషాన్ కిషన్ కోలుకుంటున్నాడు.. అయినా మూడో టీ20కి దూరం.. బీసీసీఐ కీలక ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

