Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
నకిలీ విత్తనాలతో మోసపోయామని, విత్తనాలు ఇచ్చిన ఫర్టిలైజర్ షాపు యజమానిని ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ అర్బన్, అక్టోబర్ 27 : నకిలీ విత్తనాలతో మోసపోయామని, విత్తనాలు ఇచ్చిన ఫర్టిలైజర్ షాపు యజమానిని ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని మెదక్ జిల్లా రామాయంపేట మండలం అవుసులపల్లి బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయంపేట పట్టణంలోని వెంకటేశ్వర సీడ్ ఫర్టిలైజర్ షాప్‌లో విత్తనాలు కొని నాటు వేస్తే ఎకరానికి రెండు క్వింటాళ్లు కూడా దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోయారు.
తీరా మోసపోయామని గుర్తించి సదరు ఫర్టిలైజర్ సీడ్ షాపు యజమాని దగ్గరికి వెళ్తే దానికి బాధ్యత నాది కాదని దురుసుగా సమాధానం చెబుతున్నాడని తెలిపారు. రైతులు ఎక్కువ మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తున్నాడని రైతులు తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో దరఖాస్తు చేస్తామన్నారు. అధికారులు నకిలీ విత్తనాలు సరఫరా చేసిన షాపు యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, రైతుల పంట పొలాలను వ్యవసాయ అధికారులు సందర్శించారు. పంట నష్టాన్ని పరిశీలించి పై అధికారులకు సమగ్ర నివేదిక పంపిస్తామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
Burns crop | నీళ్లు లేక కరెంట్ రాక.. సూర్యాపేట జిల్లాలో పంటను కాలబెట్టిన కౌలు రైతు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

