Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Health Tips | ఈ రోజుల్లో షుగర్ (Diabetis), బీపీ (BP) లాంటి జీవనశైలి సంబంధ వ్యాధులు సర్వసాధారణం అయ్యాయి. ఈ క్రమంలో షుగర్ నియంత్రణ కోసం చాలామంది స్వీట్లు (Sweets), ఇతర తీపి పదార్థాలను పూర్తిగా దూరం పెడతారు. అయినప్పటికీ వారి రక్తంలో చక్కెర స్థాయిలు (Sugar Levels) అదుపులోకి రాకపోవడం సాధారణంగా చూస్తుంటాం.
Health Tips : ఈ రోజుల్లో షుగర్ (Diabetis), బీపీ (BP) లాంటి జీవనశైలి సంబంధ వ్యాధులు సర్వసాధారణం అయ్యాయి. ఈ క్రమంలో షుగర్ నియంత్రణ కోసం చాలామంది స్వీట్లు (Sweets), ఇతర తీపి పదార్థాలను పూర్తిగా దూరం పెడతారు. అయినప్పటికీ వారి రక్తంలో చక్కెర స్థాయిలు (Sugar Levels) అదుపులోకి రాకపోవడం సాధారణంగా చూస్తుంటాం. అంటే వారిలో షుగర్ వ్యాధికి కేవలం ఆహారపు అలవాట్లు మాత్రమే కారణం కాదని, మనం రోజూ పట్టించుకోని కొన్ని జీవనశైలి అలవాట్లు కూడా ప్రధాన కారణమని వైద్య నిపుణులు (Health Experts) స్పష్టం చేస్తున్నారు.
ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ సంజయ్ కల్రా మాట్లాడుతూ.. డయాబెటిస్ విషయంలో చక్కెరపాత్ర కచ్చితంగా ఉంటుందని, కానీ మన శరీరం మనం జీవించే పూర్తి విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని అన్నారు. కేవలం చివరి ఓవర్ చూసి క్రికెట్ మ్యాచ్ ఫలితాన్ని అంచనా వేయడం లాంటిదే ఇదని వివరించారు. అంటే రోజంతా మనం పాటించే అలవాట్ల ప్రభావం ఆరోగ్యంపై ఉంటుందని ఆయన తెలిపారు. ఐసీఎంఆర్-ఇండియాబ్ స్టడీ ప్రకారం.. భారత్‌లో 10.1 కోట్ల మంది డయాబెటిస్తో, మరో 13.6 కోట్ల మంది ప్రీ-డయాబెటిస్తో బాధపడుతున్నారు.
ముఖ్యంగా యువతలో ఈ సమస్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆధునిక జీవనశైలిలో భాగంగా ఉదయం అల్పాహారం మానేయడం, ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, హడావుడిగా భోజనం చేయడం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి కాలక్రమేణా ఇన్సులిన్ పనితీరును దెబ్బతీస్తాయి. భోజనం తర్వాత కాసేపు నడవడం, మెట్లు ఎక్కడం వంటి చిన్నచిన్న పనులు కూడా కండరాలు గ్లూకోజ్‌ను సమర్థంగా వాడుకునేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా, సీడీసీ మార్గదర్శకాలతోపాటు పలు ఆరోగ్య నివేదికల ప్రకారం.. సరైన నిద్ర లేకపోవడం, దీర్ఘకాలిక ఒత్తిడి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి ఇన్సులిన్ పనితీరుపై ప్రభావం చూపుతాయి.
ఆరోగ్యకరమైనవిగా భావించే కొన్ని ఆహారాల్లో దాగి ఉన్న కార్బొహైడ్రేట్లు, ఫైబర్ తక్కువగా తీసుకోవడం కూడా షుగర్ లెవల్స్ పెరగడానికి కారణమవుతున్నాయి. కాబట్టి కేవలం తీపి మానేయడమే కాకుండా, సమగ్రమైన జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారానే డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడం సాధ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించి వ్యక్తిగత సలహాలు తీసుకోవడం ఉత్తమమని అంటున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

