Mechanic Rocky | టాలీవుడ్ యాక్టర్ విశ్వక్సేన్ (Vishwak Sen) లీడ్ రోల్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ మెకానిక్ రాకీ (Mechanic Rocky). రవితేజ ముళ్లపూడి (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్నాడు. విశ్వక్ సేన్ 10 (VS 10)గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ విడుదల తేదీ వాయిదా పడ్డట్టేనని తెలుస్తోంది. తాజా పోస్టర్లలో విడుదల తేదీని తొలగించి దీనిపై హింట్ ఇచ్చారు మేకర్స్.
మెకానిక్ రాకీ విడుదల ఎప్పుడనేది త్వరలోనే ప్రకటించనున్నారని ఇన్సైడ్ టాక్. మెకానిక్ రాకీ మేకర్స్ నవంబర్ 7 తేదీతో కొత్త పోస్టర్ విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానిక ఇజేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. విశ్వక్సేన్ మెకానిక్ రాకీగా చేతిలో పానను పట్టుకొని పైకి చూపిస్తున్న పోస్టర్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతుంది.
మెకానిక్ రాకీ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన గుల్లెడు గుల్లెడు సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కంపోజిషన్‌లో పాపులర్ గాయని మంగ్లీ మ్యాజికల్ వాయిస్‌తో సాగుతూ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువనుందని చెప్పకనే చెబుతోంది. ఈ చిత్రంలో నరేశ్, వైవా హర్ష, హర్షవర్ధన్, రఘరామ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Ram Charan | రాంచరణ్ అభిమానులకు ఐఫా టీం గుడ్‌న్యూస్.. ఇంతకీ ఏంటో తెలుసా..?
Zebra | సత్యదేవ్‌కు సపోర్ట్‌గా నాని.. జీబ్రా టీజర్ టైం చెప్పేశారు
Bhaagamathie 2 | భాగమతి మళ్లీ వచ్చేస్తుంది.. అనుష్క భాగమతి 2పై డైరెక్టర్ అశోక్ క్లారిటీ
Bipasha Basu | బిపాషా బసు బాయ్ ఫ్రెండ్ కోసం శాఖాహారిగా మారిందట..!