పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్తో సలార్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయితే టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Maruthi)-ప్రభాస్ కాంబోలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఒకటి ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రాజెక్టు హార్రర్ కామెడీ నేపథ్యంలో ఉండబోతున్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అంతేకాదు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు చివరలో కానీ, సెప్టెంబర్ మొదటి వారంలో కానీ మొదలుకానుందట.
ఇక సోషల్ మీడియా సెన్సేషన్, గ్లామర్ క్వీన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan) ఈ ప్రాజెక్టులో ప్రభాస్తో రొమాన్స్ చేయనుందని టాక్ నడుస్తోండగా..దీనిపై అఫీషియల్ అప్ డేట్ రావాల్సి ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ పనిచేయనున్నాడు. ఈ చిత్రంపై మరిన్ని అప్ డేట్స్ త్వరలోనే వెల్లడి కానున్నట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం. మొత్తానికి సలార్ లాంటి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తూనే..మరోవైపు హార్రర్ కామెడీతో అలరించేందుకు రెడీ అవుతున్నాడన్న వార్తలు రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మరి తాజా అప్డేట్పై మేకర్స్ నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందో చూడాలి. ఈ మూవీకి రాజా డీలక్స్ (Raja Deluxe) పేరును మేకర్స్ పరిశీలిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు తెరపైకి వచ్చాయి. మరి మారుతి ఈ క్రేజీ కాంబో చిత్రానికి ఏ టైటిల్ పెడతాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ అభిమానులు.