Vijay Ananya Hook step | విజయ్-అనన్య పాండే హుక్ స్టెప్ అదిరిందంతే..వీడియో హల్చల్
బాలీవుడ్ భామ అనన్యపాండే (Ananya Pandey) లైగర్ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్న విజయ్‌దేవరకొండ (Vijay Deverakonda)తో రొమాన్స్ చేయబోతుంది. కాగా ఇద్దరు సోషల్ మీడియాలో హుక్ స్టెప్‌తో ప్రత్యక్షమయ్యారు.
త్వరలో పాన్ ఇండియా ప్రాజెక్టు లైగర్ (Liger)తో తెలుగు ప్రేక్షకులను పలుకరించబోతుంది బాలీవుడ్ భామ అనన్యపాండే (Ananya Pandey). ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్న విజయ్‌దేవరకొండ (Vijay Deverakonda)తో రొమాన్స్ చేయబోతుంది. కాగా ఇద్దరు సోషల్ మీడియాలో హుక్ స్టెప్‌తో ప్రత్యక్షమయ్యారు. జగ్ జగ్ జీయో చిత్రంలో పంజాబ్బన్ సాంగ్‌కు అదిరిపోయే హుక్ స్టెప్పులేశారు. బ్లాక్ అండ్ వైట్ షూట్లో విజయ్ ..అనన్య యెల్లో మినీ స్కర్ట్‌లో స్టైలిష్ స్టెప్పులేసి కేక పుట్టిస్తున్నారు.
హుక్‌స్టెప్ ఈ పాట వైబ్‌ని కట్టిపడేసింది..అంటూ డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ అనన్యపాండే క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సిల్వర్ స్క్రీన్‌పై ఈ ఇద్దరి కెమిస్ట్రీ సూపర్‌గా ఉండటం ఖాయమని తాజాగా ట్రెడింగ్ వీడియో చెప్పేస్తుంది. టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
లైగర్ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై అపూర్వ మెహతా, కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ ప్రాజెక్టులో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీ రోల్ చేస్తున్నాడు. టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

