ఇటీవలే టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) తన సోదరుడు మంచు విష్ణు (Manchu Vishnu)తో జరిగిన ఘర్షణ వీడియో షేర్ చేయగా.. హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ‘ఇండ్లలోకి వచ్చి మా వాళ్లను, బంధువులను ఇలాగే కొడుతుంటారండి. ఇదీ ఇక్కడి పరిస్థితి’ అంటూ మనోజ్ చెబుతున్న మాటలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
కాగా దివంగత నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా పూజా కార్యక్రమానికి మంచు మనోజ్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా మీకు, మీ సోదరుడికి మధ్య ఫైట్ జరిగిందా..? లేదా కేవలం ఫ్రాంక్ వీడియో మాత్రమేనా..? అని ఓ రిపోర్టర్ మనోజ్ ని అడిగాడు. దీనికి మనోజ్ డైరెక్టుగా సమాధానం చెప్పకుండా.. సినిమాటిక్ స్టైల్లో రిప్లై ఇచ్చాడు.
‘సినిమా, ప్రేక్షకులే నా జీవితం. నేను మళ్లీ సినిమాల్లోకి వస్తున్నా. కొత్త జీవితాన్ని ప్రారంభించా. మీ అందరి ఆశీస్సులు, మద్దతు కావాలని కోరుకుంటున్నా.. మీ ఆశీస్సులుంటాయని ఆశిస్తున్నానన్నాడు. విష్ణు వీడియో గురించి ప్రశ్నించగా.. ఆ విషయం గురించి నాకన్నా ఎక్కువగా మీకే (మీడియా) తెలుసంటూ’ సమాధానమిచ్చాడు.
మంచు మనోజ్ ప్రస్తుతం అహం బ్రహ్మాస్మి, what the fish (మనం మనం బరంపురం.. అనేది క్యాప్షన్) సినిమాల్లో నటిస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ వరుణ్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో వస్తున్న what the fish అనౌన్స్ మెంట్ పోస్టర్ లాంఛ్ చేసి తన ఫాలోవర్లలో జోష్ నింపాడు మంచు మనోజ్. డార్క్ కామెడీ-హై ఆక్టేన్ థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సినిమా ఉండబోతుంది. అహం బ్రహ్మాస్మి కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
Niharika Konidela | నెట్టింట్లోకి నిహారిక కలర్‌ఫుల్ రీఎంట్రీ.. పుకార్లపై క్లారిటీ ఇచ్చినట్టేనా..?
NTR 30 | ఎన్టీఆర్ 30 స్టన్నింగ్ అప్డేట్.. ఫస్ట్ యాక్షన్ సీన్ ఇదే
Ram Charan | కుమారుడిని చిరంజీవి ఎలా విష్ చేశాడో చూడండి..