Narasimha | ప్రతీ యాక్టర్ కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాలుండటం చూస్తూనే ఉంటాం. అయితే ఇండస్ట్రీని షేక్ చేసి ట్రెండ్ చేసిన సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి ఆణిముత్యాల్లో ఒకటి నరసింహ (Narasimha) . తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం నరసింహ. కేఎస్ రవికుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో శివాజీ గణేశన్, రమ్యకృష్ణ, సౌందర్య కీలకపాత్రల్లో నటించారు. 1999లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఇప్పటికీ ఎప్పటికీ ఆల్‌టైం ఫేవరేట్‌గా నిలుస్తుందని.. సినిమాలో వచ్చే డైలాగ్స్ చెప్పేస్తాయి.
కాగా సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి ఈ మ్యాజిక్‌ను చూడాలనుకునే వారి కోసం అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. రజినీకాంత్ బర్త్ డే సదర్భంగా 2025 డిసెంబర్ 12న థియేటర్లలో గ్రాండ్‌గా రీరిలీజ్ చేస్తున్నట్టు సౌందర్య రజినీకాంత్ ట్వీట్ చేసింది. అప్పట్లో ఈ చిత్రం 200కుపైగా థియేటర్లలో గ్రాండ్‌గా స్క్రీనింగ్ అయింది. మళ్లీ పాతికేళ్ల తర్వాత థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రానికి బాక్సాఫీస్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతుందని సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇంకేంటి మరి మరోసారి నరసింహను సిల్వర్ స్కీన్‌పై చూసేందుకు రెడీగా ఉండండి.
50 వసంతాలు.. వన్ అండ్ ఓన్లీ రజినీకాంత్.. తన చరిష్మా, మ్యానరిజం, హ్యుమానిటీతో, బిగ్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేశారు. ఆయన నటించిన ఐకానిక్ క్రియేషన్స్‌లో ఒకటి. సూపర్ స్టార్ స్వయంగా నటిస్తూ నిర్మించిన చిత్రం పడయప్ప 25 ఏండ్ల మళ్లీ మీ ముందుకు అంటూ షేర్ చేసిన గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతోంది.
For 50 unforgettable years, the one and only #SuperstarRajinikanth has inspired generations with his grace, his humility, and his unmatched magic on screen. ❤️✨
Today, as millions celebrate this golden milestone, watch Thalaivar relive the memories behind one of his most iconic… pic.twitter.com/EqBWgdk71N
— soundarya rajnikanth (@soundaryaarajni) December 7, 2025
ItsOkayGuru | ‘ఇట్స్ ఓకే గురు’ తప్పకుండా అందరినీ అలరిస్తుంది : మెహర్ రమేష్
Hyderabad | అంత్యక్రియలకు డబ్బుల్లేక మృతదేహంతో మూడు రోజులు