Mana Shankara Varaprasad Garu | టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం మన శంకర వర ప్రసాద్‌గారు (Mana Shankara Varaprasad Garu). అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ‘పండగకు వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. వెంకటేశ్ గెస్ట్ రోల్ పోషిస్తున్నాడు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి టీం హైదరాబాద్‌లో చిరంజీవిపై సోలో సాంగ్‌ను చిత్రీకరిస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. ఆట సందీప్ ఈ సాంగ్‌ను కొరియోగ్రఫీ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం చిరంజీవి, వెంకటేశ్‌పై వచ్చే స్పెషల్ సాంగ్ షూట్‌ను పూర్తి చేశారు మేకర్స్. ఈ పాట సినిమాకే హైలెట్‌గా ఉండబోతుందని.. త్వరలోనే పూర్తి వివరాలపై క్లారిటీ వస్తుందని టాక్.
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన మీసాల పిల్ల సాంగ్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతుండగా.. శశిరేఖ సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ మూవీలో వీటీవీ గణేశ్, కేథరిన్ థ్రెసా, హర్షవర్దన్, రేవంత్ భీమల (సంక్రాంతికి వస్తున్నాం) ఫేం బుల్లిరాజు) కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ మూవీని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయనుండగా.. రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
ItsOkayGuru | ‘ఇట్స్ ఓకే గురు’ తప్పకుండా అందరినీ అలరిస్తుంది : మెహర్ రమేష్
Hyderabad | అంత్యక్రియలకు డబ్బుల్లేక మృతదేహంతో మూడు రోజులు