Suriya 47 | కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఇప్పటికే ఆర్జే బాలాజీ డైరెక్షన్లో కరుప్పు సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే మరోవైపు సూర్య 47 ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టాడు. ఈ చిత్రానికి మాలీవుడ్ మూవీ ఆవేశం ఫేం జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ వార్త వచ్చేసింది. సూర్య 47 చిత్రం పూజాకార్యక్రమం ఆదివారం చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. సూర్య అండ్ టీం, ఇతర సభ్యులు ఈవెంట్లో పాల్గొన్నారు. సూర్య ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. మలయాళం, తమిళ బైలింగ్యువల్ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి సుశిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్‌కు సంబంధించిన వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది.
మలయాళంలో యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా ఫహద్ ఫాసిల్ హీరోగా జీతూ మాధవన్ తెరకెక్కించిన ఆవేశం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. మరి జీతూ మాధవన్ సూర్యతో సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
🙏❤️#Suriya47 pic.twitter.com/jfFSx0WFR3
— Naslen (@naslen__) December 7, 2025
ItsOkayGuru | ‘ఇట్స్ ఓకే గురు’ తప్పకుండా అందరినీ అలరిస్తుంది : మెహర్ రమేష్
Hyderabad | అంత్యక్రియలకు డబ్బుల్లేక మృతదేహంతో మూడు రోజులు