Ashes Series : సొంతగడ్డపై ఆస్ట్రేలియా (Australia) చెలరేగి ఆడుతోంది. యాషెస్ సిరీస్‌లో మొదటిదైన పెర్త్‌లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించిన ఆతిథ్య జట్టు పింక్ బాల్ టెస్టు (Pink Ball Test)లోనూ విజయఢంకా మోగించింది. ఈసారి కూడా పర్యాటక జట్టును మిచెల్ స్టార్క్ (6-75, 77, 2-64) దెబ్బతీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో ఆసీస్‌కు భారీ స్కోర్ అందించిన ఈ స్పీడ్‌స్టర్.. వికెట్ల వేటతో ఇంగ్లండ్ నడ్డివిరిచాడు. స్వల్ప ఛేదనను 2 వికెట్లు కోల్పోయి ఛేదించిన ఆసీస్ సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బ్యాటుతో బంతితో చెలరేగిన స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
ఆస్ట్రేలియా గడ్డపై యాషెస్ సిరీస్ గెలవాలనే ఇంగ్లండ్ కల కల్లలయ్యేలా ఉంది. తొలి టెస్టులో చావుదెబ్బ తిన్న బెన్ స్టోక్స్ సేన.. గబ్బాలోనూ చేతులెత్తేసింది. మిచెట్ స్టార్క్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టగా.. మీడియం పేసర్ మైఖేల్ నెసర్ (5-42) తొలి ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆసీస్ విజయంలో భాగమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ (138 నాటౌట్) అజేయ శతకంతో ఆసీస్‌కు సవాల్ విసిరిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం కుప్పకూలింది. నెసెర్, స్టార్క్ విజృంభణతో పర్యాటక జట్టు 241కే ఆలౌటయ్యింది. ఓపెనర్ జాక్ క్రాలే (44), కెప్టెన్ బెన్ స్టోక్స్(50) మాత్రమే రాణించారు. 65 పరుగుల స్వల్ప ఛేదనలో ట్రావిస్ హెడ్(22) ధనాధన్ ఆడగా.. కెప్టెన్ స్టీవ్ స్మిత్(23 నాటౌట్) సిక్సర్‌తో ఆసీస్‌ను గెలిపించాడు.
10 Tests without a win at the Gabba for England – their last was in 1986 😱 pic.twitter.com/WEqyhRmVGF
— ESPNcricinfo (@ESPNcricinfo) December 7, 2025
పెర్త్‌లో మిచెల్ స్టార్క్ సూపర్ స్పెల్, ట్రావిస్ హెడ్ మెరుపు సెంచరీతో దారుణ ఓటమి చవిచూసిన ఇంగ్లండ్ గబ్బాలోనూ మ్యాచ్ అప్పగించేసింది. డే-నైట్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టులో జో రూట్(138 నాటౌట్) అజేయ శతకంతో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. ఇంగ్లిష్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఓపెనర్ వెథర్లాండ్(72), లబూసేన్(65), మిచెల్ స్టార్క్(77), స్టీవెన్ స్మిత్(61), అలెక్స్ క్యారీ(63)ల అర్ధ శతకాలతో ఆసీస్‌కు భారీ స్కోర్ అందించారు. 416కే ఎనిమిది వికెట్లు పడిన ఆతిథ్య జట్టు స్టార్క్ హాఫ్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగులకు ఆలౌటయ్యింది.
Steve Smith that is INCREDIBLE 🤩
(via @cricketcomau) #Ashes pic.twitter.com/UU1bAHaj29
— ESPNcricinfo (@ESPNcricinfo) December 7, 2025
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ చూస్తుండగానే కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు జాక్ క్రాలే(44), బెన్ డకెట్(15) శుభారంభమిచ్చారు. తొలి వికెట్‌కు 48 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని విడదీసిన బోలాండ్ వికెట్ల వేటకు తెరతీశాడు. కాసేపటికే ఓలీ పోప్(26)ను నేసర్ రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపాడు. ఆ తర్వాత బొలాండ్ (2-33), స్టార్క్(2-48) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రూట్(15), హ్యారీ బ్రూక్(15), జేమీ స్మిత్(4)లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆసీస్ పేసర్ల జోరుతో 128కే ఆరు వికెట్లు పడిన జట్టును ఆదుకునేందుకు బెన్ స్టోక్స్(50 నాటౌట్), విల్ జాక్స్(41) ప్రయత్నించారు. మూడోరోజు ఆట ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసిన ఇంగ్లండ్ నాలుగో రోజు అద్భుతం చేయలేకోయింది. స్టోక్స్ అర్ధ శతకంతో మెరిసినా.. మిగతావారి నుంచి సహకారం అందలేదు. దాంతో.. సిరీస్‌లో 2-0తో ఆసీస్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.