TarunBhascker | దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యువ సంచలనం తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ శాంతి శాంతి శాంతి’. మలయాళంలో వచ్చిన జయ జయ జయ జయహే సినిమాకు రీమేక్‌గా రాబోతుంది ఈ చిత్రం. ఈ సినిమాకు ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహిస్తుండగా సృజన్ యారబోలు, ఆదిత్య పిట్టే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్ అప్డేట్ను ప్రకటించింది చిత్రయూనిట్. ఈ సినిమా టీజర్‌ను డిసెంబర్ 08న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కామెడీ కథాంశంతో ఈ సినిమా రాబోతుండగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోబోతుందని చిత్రబృందం తెలిపింది.
మా గోదారొళ్ళకి ఎటకారం, మమకారం తో పాటు పట్టుదల కూడా కూసంత ఎక్కువే…ఆయ్ 😉#OmShantiShantiShantihi pulls you into a new level of tug of war entertainment this 𝐉𝐚𝐧 𝟐𝟑𝐫𝐝, 𝟐𝟎𝟐𝟔 ❤️🔥#OSSSTeaser out tomorrow 🔥#OSSS #OSSSonJan23rd#TharunBhascker @yourseesha… pic.twitter.com/qmoieDSb6w
— BA Raju’s Team (@baraju_SuperHit) December 7, 2025