Niharika Konidela | నెట్టింట్లోకి నిహారిక కలర్‌ఫుల్ రీఎంట్రీ.. పుకార్లపై క్లారిటీ ఇచ్చినట్టేనా..?
రెగ్యులర్‌గా ఏదో ఒక అప్డేట్తో అందరినీ పలుకరించే నిహారిక కొణిదెల (Niharika Konidela) గతేడాది డిసెంబర్లో పోస్ట్ పెట్టిన తర్వాత మళ్లీ నెట్టింట కనిపించలేదు. నిహారిక ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda)విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల (Niharika Konidela) సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుందని తెలిసిందే. అయితే రెగ్యులర్‌గా ఏదో ఒక అప్డేట్తో అందరినీ పలుకరించే నిహారిక గతేడాది డిసెంబర్లో పోస్ట్ పెట్టిన తర్వాత మళ్లీ నెట్టింట కనిపించలేదు. నిహారిక ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda)ఒకరినొకరు అన్‌ఫాలో అవడం, నిహారికతో ఉన్న ఫొటోలన్నీ చైతన్య డిలీట్ చేయడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ వార్తల నేపథ్యంలో నిహారిక ఇప్పుడు నెట్టింట మళ్లీ యాక్టివ్‌గా మారిపోయింది. సుమారు 3 నెలల తర్వాత సోలో స్టిల్‌తో అందరి ముందుకొచ్చింది నిహారిక. రెడ్ ఆరెంజ్ హాఫ్ శారీలో నిహారిక తెలుగుదనం ఉట్టిపడే లుక్‌లో మెరిసిపోతూ ఫొటోషూట్‌లో పాల్గొన్నది. ఈ స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ఇప్పుడీ స్టిల్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న తన సోదరుడు రాంచరణ్‌కు శుభాకాంక్షలు కూడా తెలియజేసింది నిహారిక.
నిహారిక ప్రస్తుతం వెబ్‌సిరీస్‌లను నిర్మించడంతోపాటు నటిగా పలు ప్రాజెక్ట్‌లకు సైన్ చేసింది. త్వరలో సిల్వర్ స్క్రీన్‌పై గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. నిహారిక సోలో స్టిల్స్‌తో మెరిసిపోతూ.. ఇక ప్రొఫెషనల్ కెరీర్‌పై ఫోకస్ పెట్టబోతున్నట్టు పరోక్షంగా చెప్పేస్తుందంటున్నారు సినీ జనాలు. మరి ఈ భామ విడాకుల వార్తలపై ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.
హాఫ్ శారీలో నిహారిక..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

