గురువారం 04 జూన్ 2020
Cinema - May 13, 2020 , 07:47:47

అబ్బాయి అయితే చాలు.. పెళ్లిపై రకుల్ స‌మాధానం

అబ్బాయి అయితే చాలు.. పెళ్లిపై రకుల్ స‌మాధానం

గ్లామ‌ర్ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఎట్ట‌కేల‌కి త‌న పెళ్లిపై నోరు విప్పింది. ఎలాంటి వరుడు కావాల‌నుకుంటుందో వివ‌రించింది. లాక్‌డౌన్ స‌మయంలో మంచు ల‌క్ష్మీ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ప‌లువురు సెల‌బ్రిటీల‌ని ఇంట‌ర్వ్యూ చేస్తుండగా, ఇదే క్ర‌మంలో ర‌కుల్‌ని అనేక‌ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌లు అడిగింది. ఇందులో ర‌కుల్ పెళ్ళికి సంబంధించిన వార్త సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

త‌న‌కి కాబోయే వ‌రుడి గురించి మాట్లాడిన ర‌కుల్‌.. గ‌తంలో నా ద‌గ్గ‌ర చాంతాడంత లిస్ట్ ఉండేది. కాని ఇప్పుడు నేను చేసుకోబోయే వాడు అబ్బాయి చాలు అని న‌వ్వ‌కుంటూ చెప్పుకొచ్చింది ర‌కుల్‌. ఆ త‌ర్వాత క్వాలిటీస్ గురించి వివ‌రిస్తూ.. తనకు అందగాడు అవసరంలేదని.. జీవితాన్ని ముందుకు నడిపించ గలిగేవాడు, తన పని మీద మక్కువ ఉండేవాడు కావాలని రకుల్ బదులిచ్చారు. బుద్ధిమంతుడు, తెలివైన వాడు అయ్యి ఉండ‌టం చాలా ముఖ్యం అని ర‌కుల్ పేర్కొంది.

ఫిట్‌నెస్‌కి సంబంధించిన విష‌యాలు కూడా మాట్లాడిన ర‌కుల్ త‌న‌కి చిన్న‌ప్ప‌టి నుండి గేమ్స్ ఆడ‌డం ఇష్టం. 18 ఏళ్ళ వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు వ‌ర్కవుట్స్ మొద‌లు పెట్టాను. ఇప్పుడు ఇది లైఫ్‌లో భాగం అయిపోయింద‌ని చెప్పుకొచ్చింది ర‌కుల్. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ల‌లో సత్తా చాటుతున్న ర‌కుల్ ఇటీవ‌ల హిందీలో‌ ‘దే దే ప్యార్ దే’,  ‘మార్ జవాన్’, ‘సిమ్లా మిర్చి’ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒక తెలుగు సినిమా కూడా ఉంది.  లాక్‌డౌన్ అయిన త‌ర్వాత తాను హైద‌రాబాద్‌కి వ‌స్తాన‌ని అంటుంది. logo