న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఎట్టకేలకు తీహార్ జైలు అధికారులు ఇన్సులిన్ ఇచ్చారు. ఈ విషయాన్ని మంగళవారం ఆప్ కన్ఫర్మ్ చేసింది. లో డోసు ఇన్సులిన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ సోమవారం 217గా ఉన్నట్లు తెలిపారు. అయితే షుగర్ లెవల్ 200 దాటినప్పుడు లో డోసులో ఇన్సులిన్ ఇవ్వవచ్చు అని ఎయిమ్స్ వైద్యుల బృందం పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్‌ను చంపాలన్న కుట్రలో బీజేపీ ఉన్నట్లు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. కావాలని జైలు అధికారులు కేజ్రీవాల్‌కు చికిత్సను ఇవ్వడం లేదని సంజయ్ పేర్కొన్నారు.