Shine Tom Chacko | మలయాల నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో (accident) ఆయన తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. టామ్ చాకో, ఆయన తల్లి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన తమిళనాడు (Tamil Nadu) సమీపంలోని ధర్మపురిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.
టామ్ చాకో తన ఫ్యామిలీతో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఉదయం 7 గంటల ప్రాంతంలో పాలకోట్టై సమీపంలో వీరి కారు లారీని ఢీ కొట్టింది. ఆ సమయంలో కారులో డ్రైవర్‌తోపాటు టామ్ చాకో, ఆయన తండ్రి సీపీ చాకో, తల్లి, సోదరుడు ఉన్నారు. ప్రమాదంలో టామ్ చాకో తండ్రి సీపీ చాకో ప్రాణాలు కోల్పోగా.. టామ్ చాకో, ఆయన తల్లి, సోదరుడు, కారు డ్రైవర్ గాయాలతో బయటపడ్డారు. వారు ప్రస్తుతం ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also Read..
Akhil -Zainab | అట్టహాసంగా అఖిల్-జైనబ్ వివాహం.. ఎవరెవరు హాజరయ్యారంటే..!
Jayam Ravi | విడాకులే మంజూరు కాలేదు.. సైలెంట్‌గా సింగర్‌ని పెళ్ళి చేసుకున్న జయం రవి
Lavanya Tripathi | మెగా ఇంట్లో విషాదం.. నా ముద్దుల బిడ్డ రెస్ట్ ఇన్ పీస్ అంటూ లావణ్య పోస్ట్