Akhil -Zainab | ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అఖిల్-జైనబ్ వివాహం అట్టహాసంగా జరిగింది. శుక్రవారం(జూన్ 6) ఉదయం ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. ప్రియురాలు జైనబ్‌ని వేద మంత్రాల సాక్షిగా పెళ్లాడాడు. జూబ్లిహిల్స్‌లోని నాగార్జున నివాసంలో మూడు గంటలకి ఈ వివాహం జరిగినట్టు తెలుస్తుంది. అతి కొద్ది మంది మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. గతేడాది నవంబర్ 26న వీరిద్దరి ఎంగేజ్మెంట్ కాగా, అందుకు సంబంధించిన ఫొటోలని నాగార్జున తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు పెళ్లి ఫోటోలని కూడా నాగ్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తాడా అనేది చూడాలి.
అఖిల్ పెళ్లికి చిరంజీవి, సురేష్, రామ్ చరణ్, ఉపాసన హాజరయ్యారు. వీరితోపాటు దగ్గుబాటి ఫ్యామిలీ కూడా అటెండ్ అయినట్టు తెలుస్తుంది. వెంకటేష్, రానా, సురేష్ బాబు వంటివారు ఈ పెళ్ళి వేడుకలో సందడి చేశారు. అఖిల్, జైనబ్‌ల పెళ్లి ఫోటో కోసం అక్కినేని ఫ్యామిలీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తన కొడుకు వివాహాన్ని నాగార్జున పూర్తి ప్రైవేట్ సెర్మనీగా జరిపాడు. మీడియా కవరేజ్‌కి కూడా అనుమతి ఇవ్వలేదు. ఇక అఖిల్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ కూడా సందడిగా నిర్వహించారు. ఇందులో అక్కినేని ఫ్యామిలీ పాల్గొంది. ఇక పెళ్లిలో అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల, సుశాంత్, సుమంత్, అక్కినేని వెంకట్, నాగసుశీల, సుప్రియా, వారి ఫ్యామిలీ మెంబర్స్ అంతా పాల్గొన్నట్టు తెలుస్తుంది.
అయితే తమ్ముడి పెళ్లిలో అన్న సందడి ఓ రేంజ్లో ఉందట. బరాత్ కార్యక్రమంలో నాగ చైతన్య రెచ్చిపోయి డ్యాన్స్ చేసినట్టు తెలుస్తుంది. సుశాంత్ కూడా అదరగొట్టాడు. ఆయన డాన్స్ వీడియో వైరల్ అవుతుంది. రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా అఖిల్ పెళ్లి బరాత్‌లో డాన్సులు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఇక ఈనెల 8న(ఆదివారం) సాయంత్రం గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేశారట నాగార్జున. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఇతర రాజకీయ ప్రముఖులు, ఇండస్ట్రీ నుంచి చాలా వరకు హీరోలు, దర్శకులు, నిర్మాతలు, కొందరు హీరోయిన్లు కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.