Lavanya Tripathi | మెగా ఇంట్లో విషాదం నెలకొంది. తను అల్లారు ముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క మృతి చెందడంతో ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టింది. నేను ఇప్పటివరకు కలిసిన ముద్దుల కూతురు నువ్వు. నీకు వీలైతే నాకోసం టీ పెట్టడానికి కూడా ప్రయత్నిస్తావని నేను అందరికీ చెబుతుంటాను. ఎంత మంచి హృదయం.. ఎంత తెలివైనదానివి. నువ్వు నిజంగా ప్రత్యేకమైన దానివి స్వీటీ. రెస్ట్ ఇన్ పీస్’ అంటూ లావణ్య త్రిపాఠి తన సోషల్ మీడియాలో పెట్ డాగ్ ఫొటోలు షేర్ చేస్తూ రాసుకొచ్చింది. లావణ్య పోస్ట్‌ని బట్టే ఆ పెట్ డాగ్ అంటే లావణ్యకి ఎంత ఇష్టమో అర్ధమవుతుంది. ఇక లావణ్య పోస్ట్‌కి నెటిజన్స్ ఓ శాంతి అని కామెంట్స్ చేస్తున్నారు
ఇక మెగా హీరో వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి ఇటీవల తన ప్రగ్నెన్సీ ని ప్రకటించి అందరికి శుభవార్త అందించింది. త్వరలోనే లావణ్య తల్లి కాబోతుంది. ప్రస్తుతం లావణ్య ఇంటి పట్టునే ఉంటూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన లావణ్య ఇటీవల ‘సతీ లీలావతి’ అనే సినిమా చేసింది. గర్భం దాల్చడంతో ఆ సినిమా కూడా వాయిదా పడే అవకాశం ఉందనే టాక్ నడుస్తుంది. అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన లావణ్య తొలి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నటన పరంగాను, గ్లామర్ పరంగాను మంచి మార్కులు కొట్టేసింది.
ఇక అందాల రాక్షసి తర్వాత లావణ్యకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ‘దూసుకెళ్తా’, ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అయితే లావణ్య కెరియర్ లో ఒక్క చిత్రం కూడా పెద్ద హిట్ కాలేదు. భలే భలే మగాడివోయ్ చిత్రం ఒక్కటే మంచి విజయం సాధించింది. అయితే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరు కలిసి మిస్టర్, అంతరిక్షం చిత్రాలు చేశారు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ పుట్టి పెళ్లిగా మారింది.