Jayam Ravi | ఈ మధ్య సెలబ్రిటీల విడాకుల వార్తలు మనం ఎక్కువగా వింటున్నాం. ఈ క్రమంలోనే జయం రవి- ఆర్తి దంపతుల విడాకుల గొడవ కూడా మీడియా హెడ్ లైన్స్ లో నిలిచింది. ఆ ఇద్దరూ కూడా సోషల్ మీడియా వేదికరగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. తమ బ్రేకప్ కి కారణం `మూడో వ్యక్తి` అంటూ ఆర్తి రవి అన్నారు. అయితే సింగర్ కెనీషా తన స్నేహితురాలు మాత్రమేనని జయం రవి (రవి మోహన్) వివరణ ఇచ్చారు. మోహన్ తనకు 40లక్షల భరణం చెల్లించాలని ఆర్తి డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై చెన్నై కోర్ట్ సీరియస్ అయింది. ఇకపై ఇలాంటి ప్రచారం తగదని చెన్నై హైకోర్టు ఉత్తర్వు జారీ చేసింది. అయితే కేసు కోర్టులో ఉన్నందున ఆ ఇద్దరిలో ఎవరూ ఎటువంటి బహిరంగ ప్రకటనలు లేదా పత్రికా ప్రకటనలు చేయోద్దని కూడా హెచ్చరించింది. ఇక ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 12న జరుగుతుంది.
ఇక ఇదే సమయంలో జయం రవి సైలెంట్ గా 2వ పెళ్ళి చేసుకున్నాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కెనీషా ఫ్రాన్సిస్, జయం రవి..మేడలో పూల దండలు వేసుకొని ఫొటోలకి పోజులు ఇచ్చారు. పక్కనే బ్రాహ్మణులు కూడా ఉన్నారు. ఏంటి విడాకులు మంజూరు కాకుండానే జయం రవి రెండో పెళ్లి ఎలా చేసుకున్నాడు అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై పూర్తి క్లారిటీ అయితే రావలసి ఉంది. కాగా, జయం రవి తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు గతేడాది ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.
అయితే తనని సంప్రదించుకుండానే జయం రవి విడాకుల విషయంపై ప్రకటన చేశాడని ఆర్తి ఆరోపిస్తుంది. ఇటీవల రవిని ఉద్దేశిస్తూ ఆర్తి ఓ పోస్ట్ పెట్టగా.. దానికి కౌంటర్ గా జయం రవి నాలుగు పేజీల సుదీర్ఘమైన నోట్ షేర్ చేయడం హాట్ టాపిక్ అయింది. జయం రవి అత్తగారు కూడా ఆయనపై పలు ఆరోపణలు చేసింది. మరి జూన్ 12న వీరి విడాకుల విషయంలో ఓ క్లారిటీ అయితే వస్తుందని అనుకుంటున్నారు