Trivikram Srinivas | కెరీర్లో ఎన్నడు లేనంత కన్ఫ్యూజన్లో త్రివిక్రమ్ ఉన్నాడు అంటున్నారు ఇప్పుడు అభిమానులు. అదేంటి అంత మాట అనేశారని అనుకోవచ్చు.. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న పనులు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సినిమా చేస్తున్నప్పుడు మరో సినిమా అనౌన్స్ చేయడం దాదాపుగా ఈయన కెరీర్లో ఎప్పుడూ జరగలేదు. ఎప్పుడో ఒకటి రెండు సార్లు నెక్స్ట్ సినిమా ఈ హీరోతో చేస్తాడేమో అని ఊహగానాలు తప్పిస్తే.. ఆయన అధికారికంగా ప్రకటించిన రోజులు అయితే లేవు. అలాంటిది ఇప్పుడు గుంటూరు కారం సినిమా మొదలు పెట్టిన తర్వాత ఎన్ని విచిత్రాలు జరగాలో అన్ని జరుగుతున్నాయి.
మరీ ముఖ్యంగా మహేశ్ బాబు లాంటి హీరోతో సినిమా చేస్తూ మరో హీరోతో పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేయడం వెనక అసలు మతలబు ఏంటి.. అంటూ అభిమానులు కూడా ఆరా తీస్తున్నారు. ఇంతకీ గుంటూరు కారం సినిమా ఉంటుందా ఉండదా అని అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా మొదలుపెట్టి సంవత్సరం అయిపోయింది.. కానీ షూటింగ్ మాత్రం ఇంతవరకు కనీసం సగం కూడా కాలేదు. ఇంకా చెప్పాలంటే 40% మాత్రమే షూటింగ్ జరిగింది అని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇంకా గతేడాది రెండు షెడ్యూల్స్ చేసిన తర్వాత దాన్నంతా తీసి పక్కన పెట్టి.. మళ్లీ ఈ ఏడాది కొత్తగా మొదలుపెట్టారు.
ఇప్పుడు అది కూడా మళ్లీ మహేశ్ బాబుకు నచ్చడం లేదని ప్రచారం జరుగుతుంది. కథ విషయంలో త్రివిక్రమ్‌ను మరోసారి నెరేషన్ అడిగినట్టు తెలుస్తోంది. ఈ విషయంలోనే అభిమానులు చాలా ఫీల్ అవుతుంటే.. తాజాగా అల్లు అర్జున్ సినిమాను అనౌన్స్ చేసి త్రివిక్రమ్ మరింత నిప్పు రాజేశాడు. మహేశ్ బాబు సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ సినిమా అనౌన్స్ చేయొచ్చు కదా.. ఇలా మధ్యలోనే ప్రకటించడం వెనుక త్రివిక్రమ్ ఉద్దేశం ఏంటి అంటూ వాళ్లు అడుగుతున్నారు. అలా తమ హీరోను అవమానిస్తున్నాడు అంటూ మాటల మాంత్రికుడిపై వాళ్లు నిప్పులు చెరుగుతున్నారు. ఏది ఏమైనా సినిమా సంక్రాంతికి వస్తుందని నమ్మకంగా చెప్తున్నాడు త్రివిక్రమ్. కానీ ఇప్పటి వరకు షూటింగ్ జరుగుతున్న తీరు చూసిన తర్వాత ఇది సంక్రాంతికి వస్తుందా అనే అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలిక చివరికి ఏం జరగబోతుందో..!
Salaar Teaser | సలార్ టీజర్లో హైలెట్ అయిన ఈ యాక్టర్ ఎవరో గుర్తున్నాడా?
Krithi Shetty | బేబమ్మ మళ్లీ పుంజుకుంటుందా.. మూడు ఇండస్ట్రీల్లో మూడు భారీ సినిమాలు..!