Lucky Baskhar | మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఈ క్రేజీ యాక్టర్ టైటిల్ రోల్లో నటిస్తోన్న మూవీ ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar). వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్గా నటిస్తోంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. నేడు హైదరాబాద్‌లో తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగనుండగా.. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ త్రివిక్రమ్ చీఫ్ గెస్టులుగా రాబోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆసక్తికర వార్త ఒకటి మూవీ లవర్స్, అభిమానులను ఖుషీ చేస్తోంది. మొదలుపెట్టారు. తెలుగు ప్రేక్షకుల కోసం అడ్వాన్స్‌గా లక్కీ భాస్కర్ (Lucky Baskhar) ప్రీమియర్ షోలు సందడి చేయబోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం మేకర్స్ తెలుగు రాష్ట్రాల్లో 100 పెయిడ్ ప్రీమియర్ షోలు ఏర్పాటు చేయనున్నారు. అక్టోబర్ 30 సాయంత్రం 6 గంటల నుంచి ఈ షోలు అందుబాటులో ఉండనున్నాయి.
ఒకవేళ పెయిడ్ ప్రీమియర్స్ కు మంచి స్పందన వస్తే దీపావళి రోజు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పెయిడ్ ప్రీమియర్స్ కు ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి. నా పేరు భాస్కర్ కుమార్.. నా జీతం ఆరు వేల రూపాయలు. బార్డర్ లైన్ దరిద్రంలో బతుకుతున్నా.. నేనే కావాలని నన్ను చేసుకుంది నా భార్య సుమతి. నా బలం నా భార్య.. అసలు కథ ఇప్పుడే మొదలైందంటూ బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తోన్న దుల్కర్ సల్మాన్ వాయిస్ ఓవర్‌తో సాగుతున్న ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది.
ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య తెరకెక్కిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
Demonte Colony 2 | గెట్ రెడీ.. ప్రియా భవానీ శంకర్ డెమోంటే కాలనీ 2 టీవీలో సందడి చేసే టైం ఫిక్స్..!
Venky Anil 3 | వెంకటేశ్, అనిల్ రావిపూడి టైటిల్, ఫస్ట్ లుక్ ఆన్ ది వే.. వీడియోతో క్రేజీ వార్త
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి