Venky Anil 3 | వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు ఘన విజయాన్ని అందుకున్నాయని తెలిసిందే. మళ్లీ సేమ్ కాంబో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించేందుకు రెడీ అవుతోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకీ నటిస్తోన్న తాజా చిత్రం Venky Anil 3. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్తను షేర్ చేసుకుంది దిల్ రాజు టీం.
సినిమా డబ్బింగ్ పనులు షురూ అయినట్టు మేకర్స్ ఎక్స్ ద్వారా ప్రకటించారు. 90 శాతం షూటింగ్ పూర్తయింది. మీ అందరికీ బిగ్ స్క్రీన్స్‌పై వినోదాన్ని అందించేందుకు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జెట్ స్పీడ్‌లో కొనసాగుతున్నాయి..అంటూ వెంకీ, ఐశ్వర్యా రాజేశ్ అండ్ చిన్నారుల టీం సెలబ్రేషన్ మూడ్‌లో ఉన్న ఓ సన్నివేశం వీడియోను షేర్ చేశారు మేకర్స్. ఇది ఓ పాటకు సంబంధించినదని వీడియో ద్వారా అర్థమవుతోంది. అంతేకాదు టైటిల్, ఫస్ట్ లుక్ త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
భారీ బడ్జెట్‌తో కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పాపులర్ మరాఠీ యాక్టర్, యానిమల్ ఫేం ఉపేంద్ర లిమాయే , ప్రముఖ తమిళ నటుడు వీటీవీ గణేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది.
#SVC58 DUBBING BEGINS 🎙️
Team #VenkyAnil3 completed 90% of the shoot and post-production happening in full swing to entertain you all on the big screens 💥💥💥
TITLE & FIRST LOOK SOON ❤️🔥
Victory @VenkyMama @AnilRavipudi @Meenakshiioffl @aishu_dil #DilRaju #Shirish… pic.twitter.com/BnEn2lPu2P
— Sri Venkateswara Creations (@SVC_official) October 27, 2024
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి
Zebra | సత్యదేవ్ జీబ్రా దీపావళికి రావడం లేదు.. ఎందుకో మరి..?