Demonte Colony 2 | తమిళంలో తెరకెక్కి తెలుగులో కూడా మంచి టాక్ తెచ్చుకుంది హారర్ జోనర్ ప్రాజెక్ట్ ‘డెమోంటే కాలనీ 2’ (Demonte Colony 2). ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. అరుల్ నిధి (Arul nithi) కీలక పాత్ర పోషించాడు. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
ఇప్పటికే ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటోన్న ఈ చిత్రం ఇక టీవీలో కూడా సందడి చేసేందుకు రెడీ అయింది. డిమోంటే కాలనీ 2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న జీ తెలుగులో మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రీమియర్ కానుంది. మరి ఈ చిత్రాన్ని టీవీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
2015లో చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ అందుకుంది డెమోంటే కాలనీ. మళ్లీ 8 ఏండ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ ప్రాజెక్టులో అరుణ్పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్, అర్చన రవిచంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి
Zebra | సత్యదేవ్ జీబ్రా దీపావళికి రావడం లేదు.. ఎందుకో మరి..?