Lokesh Kanagaraj | ఎన్ని సినిమాలు చేశామన్నది.. ఎంత క్రేజ్ సంపాదించామన్నదే ముఖ్యమనేది నేటి దర్శకులు ఫాలో అవుతున్న ట్రెండ్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే ట్రెండ్‌ను సెట్ చేసిన స్టార్ డైరెక్టర్లలో ఒకడు లోకేశ్ కనగరాజ్. లిమిటెడ్ సినిమాలతోనే సూపర్ స్టార్ డమ్ సంపాదించాడు. ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ రజినీకాంత్‌తో కూలి సినిమా చేస్తున్నాడని తెలిసిందే. కూలి షూటింగ్ దశలో ఉంది.
కాగా లోకేశ్ కనగరాజ్ ఫిలిం మేకింగ్ స్టైల్‌పై పవన్ కల్యాణ్ ఓ చిట్ చాట్‌లో ప్రశంసలు కురిపించాడు. ప్రత్యేకించి లియో సినిమా తెరకెక్కించిన విధానం పట్ల లోకేశ్ కనగరాజ్‌కు అభినందనలు తెలియజేశాడు పవన్ కల్యాణ్. ఈ కామెంట్స్‌పై తాజాగా లోకేశ్ కనగరాజ్ స్పందించాడు. పవన్ కల్యాణ్ సార్ నుంచి ఇలాంటి మాటలు వినడం చాలా గౌరవంగా భావిస్తున్నా. మీరు నా వర్క్‌ను ఇష్టపడ్డారని తెలిసి చాలా హ్యాపీగా ఫీలవుతున్నా. చాలా కృతజ్ఞతలు.. అని రిప్లై ఇచ్చాడు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
పవన్ కల్యాణ్, లోకేశ్ కనగరాజ్ ట్వీట్స్‌తో ఇక భవిష్యత్‌లో వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చే అవకాశాలున్నాయంటూ ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు అభిమానులు. మరి రానున్న రోజుల్లో ఈ క్రేజీ కాంబో వస్తుందా..? అనేది చూడాలి.
It’s truly an honour to hear these words @PawanKalyan sir ❤️
Elated and grateful to know that you’ve loved my work sir. A big thank you ❤️
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 3, 2024
Indian 3 | ఏంటీ కమల్‌హాసన్ ఇండియన్ 3 థియేటర్ రిలీజ్ లేనట్టేనా..?
Good Bad Ugly | అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీలో పాపులర్ యాక్టర్
Chiranjeevi | సినిమా వాళ్లను టార్గెట్ చేయడం సిగ్గుచేటు.. మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై చిరంజీవి
Samantha | మీ రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు : కొండా సురేఖ కామెంట్స్ పై సమంత