Good Bad Ugly | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith kumar) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly). టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే అజిత్ కుమార్ ఖైదీ గెటప్‌లో స్టైలిష్‌గా చీర్ అప్ మూడ్‌లో బ్యాక్‌డ్రాప్‌లో గన్స్ రౌండప్ చేసిన లుక్ షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త వార్త ఒకటి బయటకు వచ్చింది. నటి స్నేహ భర్త, పాపులర్ యాక్టర్ ప్రసన్న ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రసన్న సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ప్రియమైన మిత్రులారా.. ఈసారి మా డియర్ తల అజిత్ కుమార్ సార్ సినిమాలో నేను భాగమయ్యాననేది నిజం. నా కల నిజమైంది. మన్‌కథా నుంచి ఏకే సార్ సినిమాలు ప్రకటించినప్పుడల్లా అందులో నేను కూడా భాగమని ఆయన అభిమానులు భావించేవారు. నేను ఆయన తర్వాతి చిత్రంలో ఉన్నా.
నేను గుడ్ బ్యాడ్ అగ్లీలో భాగమయ్యాను. దేవుడికి, ఏకే సార్‌కి, అధిక్ రవిచంద్రన్‌కు, సురేష్‌చంద్ర సర్‌కు, మైత్రీ మూవీస్ మేకర్స్‌కు, చివరిగా తలాతో నన్ను తన సినిమాలో చూడాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. గుడ్ బ్యాడ్ అగ్లీలో భాగమైనందుకు నేను థ్రిల్‌గా, ఉత్సాహంగా ఉన్నాను. నేనిప్పుడు చాలా విషయాలు వెల్లడించలేను.. క్షమించండి. మొదటి షెడ్యూల్ షూట్లో పాల్గొన్నా. ధన్యవాదాలు, మీ అందరికీ చాలా ప్రేమతో.. అంటూ ట్వీట్ చేశాడు ప్రసన్న.
వచ్చే ఏడాది (2025) సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. వీరమ్ తర్వాత అజిత్‌కుమార్-డీఎస్పీ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్‌తో సినిమా యాక్షన్ ప్యాక్డ్ డ్రామా నేపథ్యంలో ఉండబోతుందని హింట్ ఇచ్చారు. అజిత్ మరోవైపు మగిజ్ తిరుమేని డైరెక్షన్లో విదాముయార్చి సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. సంజయ్ దత్, అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Dear friends and wellwishers,
This time It’s finally true that I’m part of our beloved Thala Ajith Kumar sir’s film. It’s a dream come true for me. Since Mankatha, every time AK sir’s films were announced, I was supposed to be a part of those. His fans kept speculating and… pic.twitter.com/S9nEjonNgc— Prasanna (@Prasanna_actor) October 3, 2024
Chiranjeevi | సినిమా వాళ్లను టార్గెట్ చేయడం సిగ్గుచేటు.. మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై చిరంజీవి
Samantha | మీ రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు : కొండా సురేఖ కామెంట్స్ పై సమంత
Chinmayi Sripada | సమంత అందరికంటే ఉన్నతమైన వ్యక్తి : సింగర్ చిన్మయి