Indian 3| తమిళం, తెలుగుతోపాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇండియన్ 2 (Indian 2). కమల్‌హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రం జులై 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైంది. శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాంఛైజీలో ఇండియన్ 3 కూడా వస్తుందని తెలిసిందే. ఒకేసారి ఇండియన్ 2, ఇండియన్ 3 షూటింగ్స్ జరిపినట్టు ఇప్పటికే తెలియజేశాడు శంకర్. ఇప్పుడిక ఇండియన్ 3 గురించే నెట్టింట చర్చ నడుస్తోంది. ఇంతకీ ఏంటా డిస్కషన్ అనే కదా..?
ఇండియన్ 3 థియేటర్లకు వచ్చే అవకాశాలు తక్కువేనని తాజా కథనాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ సర్కిల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. దీనిక్కారణం భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదల చేసిన ఇండియన్ 2 బాక్సాఫీస్ ఫలితాలేనట. ఇండియన్ 3 థ్రియాట్రికల్ రైట్స్ అమ్మకం పెద్ద టాస్క్‌గా మారిన నేపథ్యంలో మేకర్స్ ఇక నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫాంలోనే విడుదల చేయాలని భావిస్తున్నారని జోరుగా టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై రాబోయే రోజుల్లో మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
అవినీతి, లంచం లాంటి అంశాల నేపథ్యంలో భారతీయుడుకు సీక్వెల్‌గా వచ్చిన ఇండియన్ 2లో ఎస్జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్, సముద్రఖని, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, కీలక పాత్రలు పోషించారు. రెండు పార్టులకు కొనసాగింపుగా వస్తోన్న ఇండియన్ 3లో మరి కొత్త యాక్టర్లు ఎవరెవరు కనిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ లెక్కన ఒకవేళ ఇండియన్ 3 రిలీజ్ అయితే ఇదే ప్లాట్‌ఫాంలో సందడి చేయనుందా..? అనేది తెలియాల్సి ఉంది.
#Indian3 direct OTT release plan.
As because #KamalHaasan‘s #Indian2 didn’t perform well at the box office, the team would face uphill task in selling theatrical rights for Indian 3.
Hence… pic.twitter.com/Nou9GqD82I
— Manobala Vijayabalan (@ManobalaV) October 3, 2024
Chiranjeevi | సినిమా వాళ్లను టార్గెట్ చేయడం సిగ్గుచేటు.. మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై చిరంజీవి
Samantha | మీ రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు : కొండా సురేఖ కామెంట్స్ పై సమంత
Chinmayi Sripada | సమంత అందరికంటే ఉన్నతమైన వ్యక్తి : సింగర్ చిన్మయి