Liger shoot cancelled | కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. మొత్తం అన్ని ఇండస్ట్రీల్లో మళ్లీ కరోనా మ్యూజిక్ మొదలైంది. అనుకున్నట్టుగానే మూడో దశ చాలా వేగంగా వ్యాపిస్తోంది. కేవలం పది రోజుల్లోనే 15 రేట్ల కేసులు పెరిగాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుందని ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రకటించింది. దాంతో సినిమాలు వాయిదా పడుతున్నాయి. సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోతున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ సినిమా విషయంలో ఇదే జరిగింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న లైగర్ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అధికారికంగా ప్రకటించాడు విజయ్ దేవరకొండ.
తన పెంపుడు కుక్కతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ‘స్పష్టంగా మరొక తుఫాను.. షూటింగ్ రద్దు అయ్యింది’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. కొవిడ్-19 కారణంగా లైగర్ షూట్ క్యాన్సిల్ అయ్యిందనే విషయాన్ని వెల్లడించాడు విజయ్ దేవరకొండ. లైగర్ ఒకేసారి హిందీ, తెలుగు భాషలలో షూటింగ్ జరుపుకుంటుంది. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది. కన్నడ, తమిళ, మలయాళంలో కూడా డబ్ చేయనున్నారు. ఇందులో విజయ్ దేవరకొండతో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే జోడీ కడుతుంది. ప్రస్తుతానికి సినిమా షూటింగ్ ఆగిపోవడంతో ఇంట్లోనే ఉండిపోయాడు విజయ్ దేవరకొండ. షూటింగ్ ఎప్పుడు మొదలు కానుందో త్వరలోనే చెప్పనున్నాడు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, మకరంద్ దేశ్పాండే కూడా ప్రముఖ పాత్రల్లో నటించారు. 2022 ఆగస్ట్ 25న ఈ పాన్ ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
Apparently its another wave Storm.
— Vijay Deverakonda TOOFAN (@TheDeverakonda) January 7, 2022
Shoots cancelled. Back to us just chilling at home.. pic.twitter.com/mnJ2w1aGWy
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
లైగర్ ఇంకా విడుదల కాలేదు.. అప్పుడే పూరీతో విజయ్ దేవరకొండ వన్స్ మోర్..
విజయ్ దేవరకొండ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు : ఇండియన్ ఐడల్ సింగర్ షణ్ముఖ ప్రియ
Mike Tyson Remuneration | మైక్ టైసన్ రెమ్యునరేషన్ ‘లైగర్’ కంటే ఎక్కువనా..? మేకర్స్ ఏమన్నారంటే
లైగర్ బ్యూటీ బికినీ ట్రీట్ అదిరిందిగా..!
Ananya Panday | బిక్నిలో లైగర్ బ్యూటీ అనన్య అందాలు..
Ananya Panday | బ్లాక్ డ్రెస్లో హీటెక్కిస్తున్న అనన్య పాండే..