Mike Tyson Remuneration | మైక్ టైసన్ రెమ్యునరేషన్ ‘లైగర్’ కంటే ఎక్కువనా..? మేకర్స్ ఏమన్నారంటే
టాలీవుడ్ (Tollywood) హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు లైగర్ (Liger). అయితే తాజాగా బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ (Mike Tyson) పారితోషికానికి సంబంధించిన వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది.

టాలీవుడ్ (Tollywood) హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు లైగర్ (Liger). బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ (Mike Tyson) ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు ఇప్పటికే పూరీ (Puri Jagannadh) అండ్ టీం ప్రకటించింది. ఈ ప్రకటనతో లైగర్ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే తాజాగా మైక్ టైసన్ పారితోషికానికి సంబంధించిన వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. హీరో విజయ్ దేవరకొండ కంటే ఎక్కువ మొత్తంలో మైక్ టైసన్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై లైగర్ మేకర్స్ ఓ క్లారిటీ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి.
లైగర్ చిత్రానికి విజయే ఊపిరి, ప్రాణం. అతడు లైగర్ ప్రతీ ఫ్రేమ్‌లో ఉంటాడు. ఈ సినిమా నిజమైన హీరో విజయ్ దేవరకొండ. అతడికి ఆకర్షణీయమైన రెమ్యునరేషన్ ఇవ్వడం జరిగింది. అయితే మిస్టర్ టైసన్ క్లైమాక్స్ ఫైట్‌లో పాల్గొంటారు. మైక్ టైసన్ ఒక లెజెండ్. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు తగిన స్థాయిలో పారితోషికం ఇవ్వబడుతుంది. విజయ్ దేవరకొండకు ఎంత చెల్లించారో మీకు తెలియదు. మిస్టర్ టైసన్ కు ఏం చెల్లిస్తారో మీకు తెలియదు. అలాంటపుడు ఎవరికి ఎక్కువ పారితోషికం ఇస్తున్నారు..తక్కువ ఇస్తున్నారనేది మీకెలా తెలుస్తుంది..?మేకర్స్ ఈ కథనాలపై స్పందించినట్టు బీటౌన్ లో వార్త తెరపైకి వచ్చింది.
మొత్తానికి రెమ్యునరేషన్ మాట అటుంచితే బాక్సింగ్ లెజెండ్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడని ఎదురుచూస్తున్న వారికి ఓ క్లారిటీ ఇచ్చేసినట్టు అర్థమవుతుంది. క్లైమాక్స్ లో మైక్ టైసన్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాడని తాజా అప్ డేట్ చెప్పేస్తుంది. దీన్ని బట్టి రెమ్యునరేషన్ విషయంలో విజయ్, టైసన్ ను పోల్చాల్చిన అవసరం లేదని చెప్పకనే చెప్పారు మేకర్స్.
ఇవి కూడా చదవండి..
Pawan Kalyan | పవన్ కల్యాణ్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు
Nabha Natesh | లెజెండరీ నటుడి గెటప్ లో ఇస్మార్ట్ భామ..స్పెషల్ ఏంటో..?
సమంత వదిన.. మీరు మా అన్నయ్యతోనే ఉండాలి.. చైసామ్ విడాకులపై శ్రీరెడ్డి స్పందన
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

