మహేశ్ బాబు స్కిన్ స్పెషలిస్ట్ ఈమెనే..!

రాజకుమారుడు చిత్రంతో హీరోగా సిల్వర్ స్క్రీన్‌పై మెరిసి..మురారి, ఒక్కడు, పోకిరి, అతడు, శ్రీమంతుడు చిత్రాలతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు మహేశ్‌బాబు. అందరితో సూపర్ స్టార్, ప్రిన్స్ అని పిలిపించుకుంటున్నాడు. మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు గమనించినట్టైతే మహేశ్ స్కిన్ టోన్ లో పెద్దగా తేడాలేవీ కనిపించవు. సినిమా సినిమాకు కొత్తగా యంగ్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను పలుకరిస్తుంటాడు మహేశ్.
తెరపై మహేశ్‌బాబును స్టన్నింగ్ లుక్‌లో మెరుస్తున్నాడంటే కారణం ఓ వ్యక్తి. ఆమెనే మహేశ్ స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రష్మీ శెట్టి. మహేశ్‌బాబు స్కిన్ టోన్ ను కాపాడుతూ ఎప్పటికపుడు మహేశ్‌ను గైడ్ చేస్తూ సక్సెస్ఫుల్ జర్నీలో భాగస్వామ్యమయ్యారు డాక్టర రష్మీ శెట్టి. మహేశ్‌బాబుకు ధన్యవాదాలు తెలుపుతూ..అతనితో దిగిన సెల్ఫీని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది రష్మీశెట్టి. నాపై చూపిస్తున్న ప్రేమకు, నా మీద పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞతలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఈమె గురించి చెప్పాలంటే..రష్మిశెట్టి సెలబ్రిటీ స్కిన్ స్పెషలిస్ట్ (డెర్మటాలజిస్ట్). హైదరాబాద్, ముంబై నగరాల్లో రష్మీశెట్టికి చాలా మంది క్లైయింట్స్ ఉన్నారు. ఇటీవలే ముంబై నుంచి హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు మహేశ్. న్యూ లుక్ లో కనిపిస్తున్న మహేశ్ త్వరలోనే పరశురామ్ డైరెక్షన్ లో చేస్తున్న సర్కార్ వారి పాట షూట్ లో జాయిన్ కానున్నాడు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.